పుట్టిన రోజే రికార్డు.. చిన్నోడి వెయిట్‌కు అందరూ ఫిదా! | 5.5 kg Baby Born at Government Hospital | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజే రికార్డు.. చిన్నోడి వెయిట్‌కు అందరూ ఫిదా!

Jul 11 2026 7:43 AM | Updated on Jul 11 2026 7:43 AM

5.5 kg Baby Born at Government Hospital

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొయ్యూరు ప్రభుత్వ వైద్యశాలలో ఓ గర్భిణి 5.5 కిలోల బరువు శిశువుకు జన్మనిచ్చింది. చర్ల గొల్లగట్టకు చెందిన ఎం.డీ.ములాన్‌బేగంను నాలుగో కాన్పు కోసం కొయ్యూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. ఈమేరకు గురువారం రాత్రి ఆమెను పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం బాగుండడంతో సాధారణ ప్రసవం చేశారు. ఈ సందర్భంగా 5.5 కిలోల బరువుతో మగబిడ్డ జన్మించగా.. తల్లీ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యాధికారి హారిక తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement