సాక్షి, తాడేపల్లి: వియత్నాంలో బోటు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు తెలుగువారు దుర్మరణం చెందటంపై సంతాపం తెలిపారు. హాలాంగ్ బే వద్ద జరిగిన బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కడప, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన పలువురు మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రమాదంలో మృతి చెందడం ఎంతో కలిచి వేసింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. వియత్నాంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలి. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలవాలి. అక్కడి వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు.


