ఉద్యోగులకు మళ్లీ చంద్రబాబు సర్కార్‌ టోకరా | Chandrababu Govt Offers No Assurances Regarding Employees Issues | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు మళ్లీ చంద్రబాబు సర్కార్‌ టోకరా

Jul 11 2026 3:41 PM | Updated on Jul 11 2026 4:22 PM

Chandrababu Govt Offers No Assurances Regarding Employees Issues

సాక్షి, విజయవాడ: ఉద్యోగులకు మళ్లీ ఏపీ ప్రభుత్వం టోకరా వేసింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. ఒక్క సమస్య పరిష్కారానికి కూడా మంత్రులు హామీ ఇవ్వలేదు. ఇద్దరు మంత్రులతోనే చర్చలు సరిపెట్టింది. ఉద్యోగులతో మంత్రులు అనగాని, పార్థసారథి చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రి, అధికారులు లేకుండా తూతూమంత్రంగా చర్చలు సాగాయి. పీఆర్సీ, ఐఆర్, సీపీఎస్ రద్దు, అరియర్స్ పై హామీ ఇవ్వని ప్రభుత్వం.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపైనా కూడా హామీ ఇవ్వలేదు.

23 డిమాండ్లు పెడితే ఒక్కదానిపైనా హామీ ఇవ్వని మంత్రులు.. ఆర్థిక మంత్రి లేకుండా తూతూ మంత్రంగా చర్చలు జరిపారు. కేవలం బొప్పరాజు జేఏసీ ప్రతినిధులతోనే చర్చలు జరిపారు. ఇతర ఉద్యోగ సంఘాలు లేకుండా చర్చలు జరిపిన మంత్రులు., ఇతర సంఘాలు లేకుండా చర్చలు పేరుతో హాడావుడి చేశారు. ఒక్క నిర్ణయంపైనా కూడా మంత్రులు సానుకూలత ప్రకటించలేదు. ఉత్తుత్తి చర్చలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యమ కార్యాచరణ సమావేశాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు వాయిదా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement