విశాఖపట్నం: సముద్ర రక్షణలో విశాఖపట్నం ఒక బలమైన శక్తిగా నిలిచిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. INS మహేంద్రగిరి యుద్ధనౌకను శనివారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండియా నేవీలో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తిగా చేరిందని తెలిపారు. భవిష్యత్ యుద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపుదిద్దుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కానీ విజయం మాత్రం జాతీయ సంకల్పం, శిక్షణ పొందిన సిబ్బంది, బలమైన సైనిక సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
- ఫిఫ్త్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ టెక్నాలజీతో అండర్ వాటర్ టార్పోడో అభివృద్ధి చేస్తున్నాం
- ఆర్టిఫిషీయల్ ఇంటెల్ జెంట్స్, న్యూ టెక్నాలజీ , అడ్వాన్స్ షిప్ తీసుకొస్తున్నాం
- డ్రోన్ టెక్నాలజీ తో, ఫుల్ సర్వ్ లెన్స్‌తో సరికొత్త ఆధునిక యుద్ధ శక్తితో ముందుకు వెళ్తున్నాం
- కొత్త పరిజ్ఞానం యుద్ధానికి మాత్రమే కాదు ఒకో సారి మరో దేశానికి సహకారంగా కూడా నిలుస్తాం
- యుద్ధం మా నినాదం కాదు .. శాంతి, సర్వ ప్రపంచ శాంతి మా విధానం
- ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదు
- మన స్థిరత్వాన్ని బద్దలు కొడితే జరిగే పరిణామం చూపించాం
- ఇండో_పసిపుక్ సముద్ర స్నేహం కొనసాగుతోంది.
- భారత్ వ్యతిరేక శక్తులకు తగిన సమాధానం ఎప్పటికప్పుడు చెప్తాం
- మారిటైమ్ విజన్ 2030తో ముందుకు వెళ్తున్నాం
- మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ సిద్ధం చేశాం
- షిప్ బిల్డింగ్ లో మరిన్ని ఎంఎస్ఎంఈలకు స్టార్ట్‌ప్‌లకు మేలు చేస్తున్నాం
- షిప్ బిల్డింగ్, ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్ కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం
- వరల్డ్ క్లాస్ మెరిటైం ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం
చదవండి: 25 ఏళ్ల స్నేహం.. 25 వేల అప్పు


