అమ్మాయిల లోదుస్తులు దొంగలించి.. వికృత చేష్టలు..! | Man Arrested In Bengaluru For Stealing Women’s Clothes And Behaving Obscenely On CCTV, More Details Inside | Sakshi
Sakshi News home page

అమ్మాయిల లోదుస్తులు దొంగలించి.. వికృత చేష్టలు..!

Jul 11 2026 12:57 PM | Updated on Jul 11 2026 1:26 PM

 Man arrested for wearing womens innerwear

మహిళల దుస్తులు కాజేసి సీసీ టీవీ కెమెరా ముందు అశ్లీలంగా ప్రవర్తించే అసోంకు చెందిన వికృత కాముకుడిని బెంగ‌ళూరు ఇందిరానగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. అబ్దుల్‌ హుసేన్‌ పట్టుబడిన వ్యక్తి. కంపెనీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ ఇందిరానగరలో నివాసం ఉంటున్నారు. దుస్తులు కాజేయడంపై యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందిరానగర పోలీసులు అబ్దుల్‌ హుసేన్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించగా, బెయిల్‌పై విడుదలైనట్లు పోలీసులు తెలిపారు.

స్నేహితురాలితో కలిసి హొయ్సళనగరలో ఓ యువతి నివాసం ఉండేది. గత మే నెల నుంచి ఇంటి కాంపౌండు లోపల దుస్తులు ఆరబెట్టిన స్దలంలో పలుమార్లు దుస్తులు చోరీకి గురయ్యాయి. కొద్దిరోజుల అనంతరం పాత దుస్తులు మళ్లీ కౌంపౌండ్‌లో పెట్టి కొత్త దుస్తులు మాత్రమే చోరీ చేసేవారని యువతి ఇందిరానగర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దుస్తులు పలుమార్లు చోరీకి గురికావడంపై యువతి రహస్య కెమెరా అమర్చింది. 

ఈనెల 2వ తేదీ తెల్లవారు జామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి కాంపౌండ్‌లోకి అక్రమంగా ప్రవేశించి గతంలో చోరీ చేసిన దుస్తులు ధరించి మళ్లీ దుస్తుల చోరీకి పాల్పడ్డాడు. అంతేగాక కెమెరా ముందు అశ్లీలంగా ప్రవర్తించాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇందిరానగర పోలీసులు తీవ్రంగా గాలించి అరెస్ట్‌ చేసి జైలుకు పంపించగా బెయిల్‌పై విడుదలయ్యాడు.   

-బెంగళూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement