breaking news
bangalore man
-
వాట్సాప్లో తలాక్..అమెరికాకు పరార్
యశవంతపుర (బెంగళూరు): విభేదాలు పరిష్కరించుకుందామంటూ అమెరికా నుంచి భార్యను తీసుకువ్చన ఓ భర్త.. ఆమెకు తెలియకుండా తిరిగి అమెరికా చెక్కేశాడు. ఆ తర్వాత వాట్సాప్లో ఆమెకు తలాక్ చెప్పాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ జావేద్ ఖాన్, రేష్మా అజీజ్లకు 2003లో పెళ్లయింది. అమెరికాలోని ఇల్లినాయిస్లోఉంటున్న వీరికి 13 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల కొడుకు ఉన్నారు. కాగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని నవంబర్ 30వ తేదీన వారు బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగగానే ఇప్పుడే వస్తానంటూ చెప్పి భార్యను ఇంటికి పంపించి వేశాడు. తాను మాత్రం విమానంలో మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు. తర్వాత తలాక్ అంటూ మూడుసార్లు వాట్సాప్లో పోస్టులు, వాయిస్ మెసేజ్లు పంపించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
భార్యను చంపి.. ప్రియురాలి భర్తను ఇరికించి!
-
భార్యను చంపి.. ప్రియురాలి భర్తను ఇరికించి!
అతడో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన భార్యను చంపేశాడు.. ప్రియురాలి భర్తను వేరే కేసులో ఇరికించి తామిద్దరం హాయిగా ఉందామనుకున్నాడు. తీరా చూస్తే.. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. సినిమా ట్విస్టులను తలపించే ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఎంజీ గోకుల్ (33) అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లయింది కూడా. దాంతో ఆమె భర్త అడ్డు తొలగించుకోడానికి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ చేశాడు. అందుకోసం.. చాలా పెద్ద పథకమే వేశాడు. ముందుగా ఆమె భర్త పాస్పోర్టు దొంగిలించి, దాన్ని ఆధారంగా చూపించి అతడి పేరు మీద సిమ్ కార్డు కొనుగోలు చేశాడు. అలాగే, ఫేస్బుక్లో అతడి పేరుమీద ఓ పేజీ క్రియేట్ చేశాడు. అందులో అతడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిగా చూపించాడు. సైబర్ క్రైం పోలీసులకు దాని ఆచూకీ చిక్కాలని చూశాడు. కానీ అలా జరగలేదు. దాంతో, బెంగళూరు విమానాశ్రయానికి ఫోన్ చేశాడు. కానీ అక్కడ ఎవరూ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో.. ఢిల్లీ విమానాశ్రయానికి కాల్ చేసి, మూడు విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరించాడు. తర్వాత బెంగళూరు విమానాశ్రయానికి కూడా అలాంటి బెదిరింపులే వాట్సప్ మెసేజి ద్వారా పంపాడు. పోలీసులు కూడా మొదట సిమ్ కార్డు వివరాల ఆధారంగా అతడి ప్రియురాలి భర్తనే అనుమానించారు. కానీ, తర్వాత విషయం తెలిసి గోకుల్ను అరెస్టు చేశారు. ఇందులో ఉగ్రవాద కోణం ఏమీ లేదని, అయితే.. నిందితుడి భార్య అనూరాధ కొన్ని నెలల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో ఆ కేసును ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసు కమిషనర్ తెలిపారు. తన భార్యపై దాడి చేయడంతో ఆమె చనిపోయినట్లు గోకుల్ అంగీకరించాడని అంటున్నారు.