వారిపై ఐటీడీపీని ఉసిగొల్పుతున్నారు: పేర్ని నాని | Perni Nani Blames TDP for Social Media Depravity | Sakshi
Sakshi News home page

వారిపై ఐటీడీపీని ఉసిగొల్పుతున్నారు: పేర్ని నాని

Jul 11 2026 4:40 PM | Updated on Jul 11 2026 4:47 PM

Perni Nani Blames TDP for Social Media Depravity

సోషల్‌ మీడియా వికృతాలకు, వెర్రితలలకు పుట్టిల్లు టీడీపీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఇవాళ ఆయన తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేబినెట్‌ సమావేశంలో ప్రజాసమస్యల గురించి ఏ మాత్రం చర్చ జరగలేదని తెలిపారు.

అమరావతిలో చంద్రబాబు, నారాయణ ఇళ్లు కట్టుకున్నారని పేర్ని నాని చెప్పారు. అమరావతి కోసం భూములు ఇ​చ్చిన రైతుల గురించి కేబినెట్‌లో చర్చ జరగలేదని తెలిపారు. సోషల్‌ మీడియా సమాజానికి ఇబ్బందికర రోగంగా మారిందని చర్చించారట అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు దుర్మార్గ లక్ష్యాలను ఎదిరించేవారిపై ఐటీడీపీని ఉసిగొల్పుతున్నారని తెలిపారు. ఐటీడీపీ వందలాది యూట్యూబ్‌ చానెళ్లను సృష్టించిందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లోని మహిళలపై కూడా విష ప్రచారం చేస్తున్నారని అన్నాఉ. నీచంగా, వికృతంగా, అడ్డగోలుగా ఐటీడీపీ ప్రచారాలు చేస్తోందని పేర్ని నాని తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement