breaking news
singer janaki
-
లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)
-
జానకమ్మ పాడిన 48 వేల పాటల్లో అత్యంత కష్టమైన సాంగ్ ఇదే!
తన గాత్రంలో కోట్లాది మంది శ్రోతలను ఓలలాడించిన దిగ్గజ గాయని, 'దక్షిణ భారత నైటింగేల్' ఎస్. జానకి (88) ఇక లేరనే వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో దాదాపు 48 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు ఆమె.లాలిపాటలు, జానపదాలు, క్లాసికల్, మెలోడీలు.. ఇలా ఆమె పాడని పాట లేదు, పలకని భావం లేదు. అయితే, ఇన్ని వేల పాటలు పాడిన జానకమ్మకు తన కెరీర్లో అత్యంత సవాలుగా నిలిచిన ఒక పాట ఉందన్న విషయం మీకు తెలుసా?గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జానకి గారు స్వయంగా తనకు అత్యంత కష్టమైన పాట గురించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 1977లో విడుదలైన కన్నడ చిత్రం 'హేమవతి'లోని 'శివ శివ ఎన్నడ నలికే ఏకే' అనే పాట తాను పాడిన అన్ని పాటలలోకెల్లా అత్యంత కష్టమైనదని ఆమె పేర్కొన్నారు. ఈ పాటను అంత క్లిష్టంగా మార్చింది ఆ పాట యొక్క స్వరకల్పనే. సంగీత దర్శకుడు ఈ పాటలోని ప్రతి రెండో చరణంలో 'తోడి', 'అపోకి' అనే రెండు వేర్వేరు రాగాలను ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా అద్భుతంగా, అంతే క్లిష్టంగా స్వరపరిచారు.పాడేటప్పుడు రాగాలలో వచ్చే ఈ అత్యంత సూక్ష్మమైన మార్పులను పట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఏ మాత్రం శృతి తప్పినా పాట గాడి తప్పుతుంది. అందుకే, క్లాసికల్ సంగీతంలో ఎంతో పట్టున్న ఎస్. జానకి సైతం, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఈ పాటను అత్యంత సవాలుతో కూడుకున్న పాటగా అభివర్ణించారు. ఆమె భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆమె పాడిన ఇలాంటి అపురూపమైన పాటలు సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. -
మీ పేరు శాశ్వతం.. మాట లేకపోయినా పాట ఉంటుంది.. జానకమ్మకు అశ్రు నివాళులు
-
కోటి స్వరాల కోకిలమ్మ
సాక్షి, హైదరాబాద్: గానకోకిల ఎస్.జానకి మధుర స్మృతులను భాగ్య నగరం గుర్తు చేసుకుంది. శనివారం దివికేగిన ఆమెకు హైదరాబాద్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కేవలం సినీ రికార్డింగుల కోసమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితం, ఆత్మీయ సంబంధాలు కూడా ఇక్కడి ప్రజలతో ముడిపడి ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్‌కు తరలివచి్చన తర్వాత ఆమె నగరంతో మరింత మమేకమయ్యారు. సీతాఫల్మండి నుంచి.. జన్మతః జానకి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వాసి అయినప్పటికీ, ఆమె కెరీర్ ప్రారంభ దశ తెలంగాణ ప్రాంతంతో ముడిపడి ఉంది. తండ్రి ఉద్యోగ రీత్యా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నివసించారు. జానకి సినీ గాన ప్రస్థానాన్ని ప్రారంభించడానికి ముందు సీతాఫల్మండిలో ఉన్న మామగారి ఇంట్లో కొంతకాలం గడిపారు. భర్త మరణం తర్వాత, జానకి... కుమారుడు మురళీకృష్ణ కుటుంబంతో కలిసి ఉండడానికి నగరానికి వచ్చారు. బంజారాహిల్స్‌లోనూ, చివరగా మహేశ్వరంలోని బీటీఆర్ విల్లాస్‌లో నివసించారు. మురళీకృష్ణ కూడా నటుడే. ‘వినాయకుడు’ చిత్రంలో నటించారు. వీనుల విందు..రవీంద్ర భారతి, లలిత కళాతోరణం, శిల్పకళా వేదిక వంటి ప్రతిష్టాత్మక వేదికలపై ఆమె ఎన్నోసార్లు నగరవాసులకు ప్రత్యక్షంగా వీనుల విందు చేశారు. ప్రముఖ ఛానళ్లు నిర్వహించిన భారీ సంగీత అవార్డుల వేడుకలకు, ప్రత్యేక లైవ్ షోలకు హాజరయ్యేవారు. నగరంలో జరిగే ఏ సంగీత కార్యక్రమానికైనా జానకి వస్తున్నారంటే చాలు, ఆడిటోరియాలు కిక్కిరిసిపోయేవి. సంగీతప్రియులు చూపించే ఆదరణను ఆమె ఎన్నో ఇంటర్వ్యూలలో ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. సినీ సంగీత దిగ్గజాల సాన్నిహిత్యం కారణంగా ఆమె తరచూ నగరానికి రాకపోకలు సాగించేవారు. సద్గురు, సారథి, రామానాయుడు, పద్మాలయ స్టూడియోస్‌లలో పాటల రికార్డింగ్‌లో పాల్గొన్నారు. దిగ్గజ గాయని ఎస్.జానకి తన ఆరు దశాబ్దాల కెరీర్లో నగరం వేదికగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ద్వారా జీవిత సాఫల్య పురస్కారం, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులను నగరంలోనే ఆమె స్వీకరించారు. -
సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల సంతాపం
ఎస్. జానకి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తపరిచారు. మధురమైన అమృత గాత్రంతో తరతరాలుగా శ్రోతలను అలరించారు జానకమ్మగారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – రజనీకాంత్ఆమె పాడిన పాటలు ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి... కానీ ఆ ప్రేమను నేను ఎక్కడ వెతకాలమ్మా... భరించలేని దుఃఖంలో చాలామంది ఉన్నారు. వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. – కమల్‌హాసన్ జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనక జానకమ్మగారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు, మళ్లీ కళ్ల ముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మగారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. – చిరంజీవిగాన కోకిల, లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకమ్మగారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాదిమంది సంగీతాభిమానులను అలరించిన జానకమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి చిత్రాలతో పాటు... నా చిత్రాలలోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ ΄÷ందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు దశాబ్దాల అనుబంధం ఉంది. తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసిన జానకమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. – బాలకృష్ణ ప్రఖ్యాత గాయని శ్రీమతి ఎస్. జానకిగారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు గాయనీమణుల్లో ఒక ఆణిముత్యం లాంటివారు జానకిగారు. ఆమె గాత్రం ఎంతో మధురమైనది. ‘నిరీక్షణ, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, స్వాతి ముత్యం, జగదేక వీరుడు అతిలోకసుందరి, ప్రతిఘటన, అంతఃపురం’ లాంటి చిత్రాల్లో జానకిగారు పాడిన గీతాలను తెలుగు వారు ఎప్పటికీ మరచిపోరు. – పవన్ కల్యాణ్ -
17 భాషలో పాటలు...32 ప్రధాన అవార్డులు
-
జానకమ్మ మృతి సినీ సంగీతానికి తీరని లోటు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆస్పత్రిలో వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా జానకి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని కేసీఆర్ పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానుల హృదయాల్లో "జానకమ్మ"గా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్. జానకి గాత్రం ఎన్నటికీ చెరిగిపోదని ఆయన అన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రస్థానంలో వేలాది పాటలకు ప్రాణం పోసి, తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర అనేక భారతీయ భాషల్లో తన అద్భుత గానంతో సంగీత ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన మహోన్నత కళాకారిణిగా ఆమెను కొనియాడారు.తండ్రి ఉద్యోగరీత్యా అప్పటి కరీంనగర్ జిల్లాలో నివసించడం, వారి కుటుంబ మూలాలు సిరిసిల్ల ప్రాంతంతో అనుబంధం కలిగి ఉండడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ అన్నారు. జానకమ్మ మరణం ముఖ్యంగా దక్షిణ భారత సినీ సంగీతానికి, భారతీయ గాన ప్రపంచానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.జానకమ్మ వంటి మహా గాయనులకు మరణం ఉండదని, వారి గానమాధుర్యం చిరకాలం సంగీతాభిమానుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, జానకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
లెజెండరీ గాయని జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు.తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వైఎస్ జగన్ అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైఎస్ జగన్.. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కాగా, ప్రముఖ దిగ్గజ నేపథ్య గాయని ఎస్.జానకి మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మృతి చెందారు. “దక్షిణ భారత కోకిలగా ఆమె ప్రత్యేక గుర్తించారు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్. జానకి.. ఆరు దశాబ్దాలకు పైగా సినీ గాన సేవ చేశారు. 17 భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించిన గానకోకిల.. మధురమైన గాత్రంతో కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్నారు. గ్రామీణ జానపదం నుంచి శాస్త్రీయ, మెలోడీ, భక్తి గీతాల వరకు విశేష ప్రతిభ కనపరిచారు. భారతీయ సినీ సంగీత రంగానికి ఎస్. జానకి సేవలు చిరస్మరణీయం. ఎస్. జానకి మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. గానకోకిల ఎస్. జానకికి సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పించారు. -
బాలు, సుశీల & జానకిని మించిన క్రేజ్ నాది ఒక్కసారి స్టేజి ఎక్కితే..!
-
నేను సింగింగ్ ఎప్పుడు నేర్చుకోలేదు: సింగర్ జానకి
-
చిత్ర నా భక్తురాలు తనకు నేను అంటే చాల ఇష్టం: సింగర్ జానకి
-
నాకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్
-
ఆ పాటకు సంబంధించిన వారు ఎవరు లేరు ఇప్పుడు
-
సింగర్ ఎస్ జానకి ఎంత బాగా పాడిందో చూడండి
-
నేను ఇంట్లో ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు : జానకి
-
నాకు మీ ప్రేమ చాలు ఇంకేమీ వద్దు..!
-
నేను మగవారి గొంతుతో కూడా పాడగలను..!
-
ఈ సాంగ్ పాడేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా
-
జానకమ్మ ఇచ్చిన గిఫ్ట్ ని ఎప్పటికీ మర్చిపోలేను
-
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని జానకి
మైసూరు : ప్రఖ్యాత గాయని, గాన కోకిల ఎస్ జానకి (81) ఆసుపత్రిలో చేరారు. మైసూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బంధువుల ఇంట్లో ఉండగా కాలుజారి పడిపోవడంతో ఆమె కుడి కాలికి ఫ్రాక్చర్ అయిందట. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
మట్టిపాట
మట్టి వాసనలో ఒక మాధుర్యం ఉంటుంది. గాలిలో.. ఆకుల సవ్వడిలో.. రాలే చినుకులో... ప్రకృతిలోని ప్రతి ధ్వనిలో.. వినిపించే సహజమైన మ్యూజిక్ అది. ఇప్పుడు ఇదే మట్టిలోంచి... మంత్రముగ్ధం చేసే ఒక పాట వినిపిస్తోంది. మట్టిలోంచి అధాటుగా మొలకెత్తిన ఆ పాట గుండెకు హత్తుకుంటోంది. నిన్న.. ‘బేబీ’.. నేడు శాంతాబాబు మరికొన్ని స..రి..గ..మ..ల మధురిమలు. బేబీ ఇటీవలి సెన్సేషన్ బేబీ. తూర్పుగోదావరి జిల్లా వడిసలేరుకి చెందిన బేబీ, మొదట తన ఇంటి పక్కనే ఉంటున్న రాణి అనే అమ్మాయి పాడిన పాటలో దోషాలు చెప్పింది. అక్కడే నీళ్ల బకెట్ పెట్టుకుని, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ అంటూ పాట మొత్తం పాడేసింది. ఆ పాటను అక్కడే ఉన్న వీరబాబు అనే స్థానిక గాయకుడు తన ఫోన్లో షూట్ చేసి, యూ ట్యూబ్‌లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఆ పాట వైరల్ అయ్యింది. వెంటనే బేబీని ‘సాక్షి’ పలకరించింది. సాక్షిలో బేబీతో ఇచ్చిన ఇంటర్వ్యూ బేబీ జీవితాన్ని మార్చేసింది. సంగీత దర్శకులు కోటి ‘బోల్ బేబీ బోల్’లో పాడిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ బేబీని స్వయంగా కలవాలనుకున్నారు. అంతే. తనంత తానుగా బేబీని ఇంటికి పిలిపించుకున్నారు చిరంజీవి. తను స్వరపరచిన ‘ఓ చెలియా నా ప్రియ చెలియా’ పాట పాడిన బేబీని తాను చూడాలని ఎ.ఆర్.రెహమాన్ సైతం అన్నారని ఆమె చెబుతున్నారు. వాయిస్ టెస్ట్‌కి చెన్నై రమ్మని కూడా రెహమాన్ అన్నారట. ఇక ఆర్పి పట్నాయక్ కూడా ఆమెకు అవకాశం ఇస్తానన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బేబీ నిన్న జానకిని కూడా కలిశారు. వెంకట లక్ష్మి విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో చిన్న చిల్లరకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు వెంకటలక్ష్షి్మ. దానికి తోడుగా బుర్రకథలు కూడా చెప్పేవారు. ఆ వీడియోలను యూట్యూబ్‌లో కూడా అప్లోడ్ చేసేవారు. అలా దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దృష్టిలో పడ్డారు. ‘రంగస్థలం’ సినిమాలో ‘జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి..’కి పాడటానికి ఓ డిఫరెంట్ వాయిస్ కోసం ఆ ఇద్దరూ వెతుకుతున్న సమయంలో వెంకటలక్ష్షి్మ బుర్రక£ý వీడియోను యూట్యూబ్‌లో చూశారు. ఆ పాటకు ఆమె వాయిస్ అయితే బావుంటుందని భావించారు. పాట రికార్డ్ చేయడం కోసం వెంకటలక్ష్షి్మకి విశాఖ నుంచి చెన్నైకు టిక్కెట్ వేశారు చిత్రబృందం. చెన్నైలో రెండు రోజుల పాటు రికార్డ్ చేసిన ఈ పాట రెండు తెలుగురాష్ట్రాలను ఎంత ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. వెంకటలక్ష్షి్మకి బోల్డంత పాపులార్టీ వచ్చేసింది. శివనాగులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జానపదాల ద్వారా శివ నాగులు ఫేమస్. ‘రేలారే రేలా..’ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత ఐడియా సూపర్ సింగర్ కార్యక్రమంలో ఒక సింగర్స్ గ్రూప్‌కు మెంటర్‌గా ఉండేవారు శివనాగులు. చంద్రబోస్ ఆ షో జడ్జిగా వ్యవహరించేవారు. అలా శివనాగులుకు చంద్రబోస్‌తో పరిచయం ఏర్పడింది. కొత్త కొత్త వాయిస్‌లను, వాళ్లు పాడే వీడియోలన్నీ దేవిశ్రీప్రసాద్‌కు చూపించడం చంద్రబోస్ అలవాటు. అలా సూపర్ సింగర్ సమయంలో శివనాగులు గొంతును దేవిశ్రీ ప్రసాద్‌కు వినిపించారు. ‘రంగస్థలం’ సినిమాకి ఓ ఫోక్ వాయిస్ కోసం వెతుకుతుంటే శివ నాగులు వాయిస్ నచ్చడంతో, ‘ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా...’ పాడే అవకాశం లభించింది. ఆ పాట సూపర్ హిట్. ఈ సినిమా తర్వాత నాలుగైదు సినిమాల్లో పాడే అవశాలు వచ్చాయి. ‘సిల్లీ ఫెల్లోస్’ సినిమాలో పాడే అవకాశం వచ్చినప్పటికీ ఆ సమయంలో అమెరికా వెళ్లడంతో ఛాన్స్ మిస్ అయిందట. రీసెంట్గా ‘యాత్ర’ సినిమాలో పాడిన పాటకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తారట ఆయన. ఆ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాశారు. పెంచల్దాస్ ‘దారిచూడు దుమ్మూ చూడు మామ.. దున్నపోతుల బైరే చూడు...’ పాట తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలోని ఆ పాట విడుదలయ్యాక అందరి మదిలో ఒక్కటే ప్రశ్న.. ఆ పాట రాసిందెవరు? అంత చక్కగా పాడిందెవరు?. జానపదం పాటని అంత అద్భుతంగా రాసి, మహాద్భుతంగా పాడారు పెంచల్దాస్. ఆ పాట విడుదల వరకూ ఆయనెవరో తెలియదు. కడప జిల్లా చిట్వేలి మండలం దేవమాచుపల్లికి చెందిన పుట్టా పెంచల్‌దాస్‌కి రంగస్థల కళాకారుడిగా, బాతిక్ చిత్రకారుడిగా పేరుంది. పెనగలూరు మండలం చక్రంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తుండే ఆయనకి ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తొలి అవకాశం ఎలా వచ్చింది? తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ట్స్ ఆడిటోరియంలో జరిగే రచయితల సభలో పాటలు పాడినప్పుడు దర్శకుడు మేర్లపాక గాంధీ తండ్రి మురళీ దృష్టిలో పడ్డారు పెంచల్దాస్. సినిమా పాటలకు అవకాశం ఇప్పిస్తానని మేర్లపాక గాంధీకి పరిచయం చేశారు. దాస్ పాట విని, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాకి అవకాశం ఇచ్చారు గాంధీ. కానీ, అనారోగ్య కారణాల వల్ల పాడలేకపోయారు. ఆ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్నప్పుడు 20నిమిషాల్లో పాట రాసి, పాడతావా అని పెంచల్‌దాస్‌ని మేర్లపాక గాంధీ అడిగితే, ‘దారిచూడు దుమ్మూచూడు మామ..’ పాట రాశారు. ఆ పాట రెండు లైన్లు విని ఓకే చేసి దాస్‌ని మద్రాసుకు తీసుకెళ్లారు. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళకు గొ నచ్చడంతో ‘దారి చూడు..’కి అవకాశం ఇచ్చారు. అలా పెంచల్‌దాస్‌కి సినిమా దారిలో తొలి అడుగు పడింది. చంద్రలేఖ చంద్రలేఖ ప్రస్తుతం మలయాళంలో చాలా బిజీగా ఉన్న గాయని. కేరళలోని ఆదూర్కి చెందిన చంద్రలేఖ ఒక సాధారణ గృహిణి. ఏ మాత్రం సంగీత పరిజ్ఞానం లేని అతి సామాన్యురాలు. ఒకసారి తన రెండు సంవత్సరాల బాబుని ఎత్తుకుని, ‘రాజహంసమే’ పాట తన్మయంగా పాడింది. అలా పాడుతున్నప్పుడు బంధువుల అబ్బాయి ఒకరు ఆమె పాటను సెల్ ఫోన్లో రికార్డు చేసి, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఆ పాట వైరల్ అయ్యింది. ఆమె గొప్పదనాన్ని నెటిజన్లు గుర్తించారు. ఎంతటి మధురగళం అనుకున్నారు. ఆమె పాటను యూ ట్యూబ్‌లో విరగబడి చూశారు. ఆమె సన్నిహితులకు మాత్రమే ఆమె పాడుతుందని తెలుసు. ఈ పాటతో మలయాళీలకు దగ్గర అయిపోయింది. బిజిపాల్, రతీష్ వేగా వంటి ప్రముఖులు కూడా ఆమెకు అవకాశం ఇచ్చారు. కిందటి సంవత్సరం ఆమెకు ‘అవలుక్కెన్న అలగియా ముగం’ చిత్రంలో ‘ఎన్నడ కన్నా’ అనే మొదటి తమిళ పాట పాడే అవకాశం వచ్చింది. ఈ పాటను వైరముత్తు రచించారు. డేవిడ్ షోన్ స్వరపరిచారు. ఇది జరిగి ఐదేళ్లు. పెద్ద పెద్ద సంగీత దర్శకుల నుంచి వచ్చిన అవకాశాలు వినియోగించుకుంది చంద్రలేఖ. శాంతాబాబు కాసరగోడ్ జిల్లా నీలేశ్వరం పంచాయతీ పరిధిలోని నవోదయపురం శాంతాబాబు స్వస్థలం. మేకులు తయారుచేసే ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తోంది. ఆమె భర్త కూడా కూలీనే. శాంతాబాబుకు ఒక కూతురు, కొడుకు. కూతురు పీజీ చదువుతోంది. కొడుకు ప్లంబర్. శాంతా పదవ తరగతి వరకు చదువుకుంది. రెండేళ్ల కిందట పూర్వవిద్యార్థుల సమ్మేళనం సందర్భంగా నజీమ్ అర్షద్ అనే గాయకుడి కచేరి పెట్టారు. బృందగానంలో శాంతాబాబూ కూడా గొంతు కలిపింది. ఆ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు సమ్మేళనానికి హాజరైన కొందరు పూర్వ విద్యార్థులు. వైరల్ అయింది. ఆ తర్వాత శాంతాబాబుతో ఆల్బమ్స్ చేయడానికి చాలా మంది ముందుకొచ్చారు. అలా నాలుగు ఆల్బమ్స్‌లో పాడింది. అయితే మణి అప్లోడ్ చేసిన పాటను రీసెంట్గా మలయాళ నట, గాయక, దర్శకుడు నదీర్షా చూశాడు. శాంతాబాబు స్వరం ఆయనెంతగానో నచ్చింది. ఆమె ఆల్బమ్స్‌లో పాడినట్టుకూడా తెలుసుకొని వాళ్ల ద్వారా శాంతా ఫోన్ నంబర్ తీసుకుని ఆమెను సంప్రదించాడు. ‘‘నా సినిమాలో పాట పాడతారా?’’ అని అడిగాడు. ఆశ్చర్య పోవడం శాంతా వంతయింది. మొత్తానికి నదీర్షా విన్నపాన్ని మన్నించి ఆయన సినిమాలో పాడేందుకు ఒప్పుకుంది శాంతా. ఇప్పుడు ఆమె శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంటోంది. వినసొంపుగా కొత్త గొంతులు ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతోంది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఇలాంటి కొత్త గొంతులతో సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కళకళలాడుతోంది. విషయం ఉన్నవాళ్లను ఎవరూ ఆపలేరు. ఏ మూల ఉన్నా వెలుగులోకి వస్తారు. కొత్తనీరు ఎప్పుడూ రుచిగా ఉన్నట్టే కొత్త గొంతులు కూడా వినసొంపుగా ఉంటాయి. – సింహా, గాయకుడు ముగ్గురు మాణిక్యాలు ‘రంగస్థలం’ సినిమాకి అన్ని పాటలూ నేనే రాశాను. నేను, దర్శకుడు సుకుమార్, సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ రెడీ అవ్వగానే.. ముఖ్యంగా రెండు పాటలకు ఇప్పటివరకూ పరిచయం లేని గొంతు, అది కూడా పల్లె గొంతుతో పాడిస్తే బాగుంటుందనుకున్నాం. అవి ‘జిల్ జిల్ జిల్ జిగేలురాణి...’, ‘ఆ గట్టునుంటావా నాగన్న..’. ఈ పాటలకు తగ్గ గొంతుని వెతకడం మొదలుపెట్టాం. ఏటూరి నాగారంకి చెందిన రేలా కుమార్‌ని, మహబూబ్‌నగర్‌కి చెందిన శివ నాగులుని సుకుమార్, దేవీకి పరిచయం చేశాను. ఈ ఇద్దరూ టీవీ షోస్‌కి పాడుతుంటారు. అలా వాళ్లు నాకు పరిచయమయ్యారు. ఈ ఇద్దరితో పాటు సుకుమార్‌గారు కూడా ఒక ఫీమేల్ వాయిస్‌ని గుర్తించారు. ఆమె గురించి వాకబు చేసి, పిలిపించాం. ఆమె విజయనగరం జిల్లాకి చెందిన వెంకటలక్ష్మి. ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేలురాణి..’ పాటలోని ఫీమేల్ వాయిస్ ఈమెదే. మేల్ వాయిస్ రేలా కుమార్‌ది. ‘ఆ గట్టునుంటావా..’ పాడినది శివనాగులు. ఈ ముగ్గురి వాయిస్‌లను టెస్ట్ చేసి, దేవి ఓకే అన్నారు. మామూలుగా మన మధ్య తిరుగుతున్నవారిని పరిచయం చేయడం కామన్. అయితే ఇలాంటి పాటలకు మట్టిలో మాణిక్యాల గొంతులు న్యాయం చేస్తాయి. – చంద్రబోస్, సినీ గేయ రచయిత -
పదం పలికింది – పాట నిలిచింది
♦ తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే.. సినిమా పాటకు ఒక నమూనాను ఇచ్చిన కవి, వేటూరి సుందరరామ్మూర్తి. అటు పండితులూ పామరుల కోసమూ, ఇటు పండితుల్లోని పామరుల కోసమూ అన్ని రకాల పాటలనూ రాశారు. ‘పదహారేళ్ల వయసు’ చిత్రం కోసం వేటూరి రాసిన ‘సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా’ మాత్రం అన్ని వర్గాలనూ మెప్పించే పాట. అందులోని ఈ పాదాలు చూడండి: ‘తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే/ కళ్ళారా చూదామంటే నా కళ్ళు మూస్తాడే’. ఇందులో వాక్యాల్లోని సొగసు ఎంత ముఖ్యమో, ఒక కన్నెపిల్ల మానసిక స్థితిని సరిగ్గా పట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఇది మంచి కవిత్వం అయింది. భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘పతినారు వయతినిలే’కు రీమేక్ అయిన ఈ సినిమాకు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. మూలచిత్రానికి ఇళయరాజా ఇచ్చిన బాణీనే తెలుగులోనూ సంగీత దర్శకుడు చక్రవర్తి వాడుకున్నారు. పాడింది అక్కడా ఇక్కడా కూడా ఎస్.జానకి. నాయిక కూడా అక్కడా ఇక్కడా శ్రీదేవే! -
చిరు సినిమా వీక్షించిన గాయని జానకి
లక్కవరం(మలికిపురం) : ప్రముఖ సినీ గాయని ఎస్.జానకి లక్కవరం వేణుగోపాల థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాన్ని చూశారు. పండుగ సందర్భంగా తన మిత్రులైన గ్రామంలోని కేర్ ఆసుపత్రి వైద్యులను కలిసేందుకు వచ్చిన ఆమె శనివారం వారితో కలిసి సినిమాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ చిరంజీవి అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, ఈ సినిమా చాలా బాగుందని చెప్పారు. ఎనిమిదేళ్ల తరువాత ఈ వయస్సులో చిరంజీవి ఇంత స్పీడ్‌గా డాన్సులు చేయడం చాలా గొప్ప అన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ సభ్యురాలు మంగెన భూదేవి, సర్పంచ్ అలివేలు మంగతాయారు, మంగెన నాని ఉన్నారు.


