చిరు సినిమా వీక్షించిన గాయని జానకి | singer janaki visit in lakkavaram | Sakshi
Sakshi News home page

చిరు సినిమా వీక్షించిన గాయని జానకి

Jan 15 2017 10:28 PM | Updated on Jul 25 2018 3:13 PM

ప్రముఖ సినీ గాయని ఎస్‌.జానకి లక్కవరం వేణుగోపాల థియేటర్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని చూశారు. పండుగ సందర్భంగా తన మిత్రులైన గ్రామంలోని కేర్‌ ఆసుపత్రి వైద్యులను కలిసేందుకు వచ్చిన ఆమె శనివారం వారితో కలిసి సినిమాకు

లక్కవరం(మలికిపురం) : 
ప్రముఖ సినీ గాయని ఎస్‌.జానకి లక్కవరం వేణుగోపాల థియేటర్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని చూశారు. పండుగ సందర్భంగా తన మిత్రులైన గ్రామంలోని కేర్‌ ఆసుపత్రి వైద్యులను కలిసేందుకు వచ్చిన ఆమె శనివారం వారితో కలిసి సినిమాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ చిరంజీవి  అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, ఈ సినిమా చాలా బాగుందని చెప్పారు.   ఎనిమిదేళ్ల తరువాత  ఈ వయస్సులో చిరంజీవి ఇంత స్పీడ్‌గా డాన్సులు చేయడం చాలా గొప్ప అన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ సభ్యురాలు మంగెన భూదేవి, సర్పంచ్‌ అలివేలు మంగతాయారు, మంగెన నాని ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement