రాస్తారోకో చేస్తున్న మావటూరు వాసులు
మంత్రి సవిత ఇలాకాలో బస్ షెల్టర్ కబ్జా
అర్ధరాత్రి జేసీబీతో కూల్చేసిన పచ్చ సైన్యం
పెనుకొండ మండలం మావటూరులో గ్రామస్తుల నిరసన
పెనుకొండ రూరల్: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత అనుచరుల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి ఓ టీడీపీ నేత ఏకంగా బస్ షెల్టర్‌ను కబ్జా చేశాడు. దాన్ని కూల్చి ఆ స్థలంలో కాంప్లెక్సు నిరి్మంచేందుకు సిద్ధమయ్యాడు. గ్రామస్తులు ఎదురు తిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నాలుగు గ్రామాలకు అదే షెల్టర్
పెనుకొండ మండలం మావటూరులోని బస్ షెల్టర్ నాలుగు గ్రామాల ప్రయాణికులకు ఆదరువుగా ఉంది. నాగళూరు, బండపల్లి, సానిపల్లి, మావటూరు గ్రామాల ప్రజలు పెనుకొండ, మడకశిర పట్టణాలకు వెళ్లేందుకు ఈ బస్‌షెల్టర్ వద్దే వేచి ఉంటారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ షెల్టర్ స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకుడు జ్యోతీష్ దాన్ని కూల్చి అక్కడ కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకు ఇవ్వాలనే పన్నాగం వేశాడు. శుక్రవారం అర్ధరాత్రి జేసీబీతో బస్‌షెల్టర్‌ను కూల్చేయించాడు.
గ్రామస్తులు అతన్ని నిలదీయటంతో పారిపోయాడు. దీంతో బస్ షెల్టర్ కూల్చేందుకు ఉపయోగించిన జేసీబీని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఉదయానికి ఈ విషయం మిగిలిన గ్రామాల వారికి తెలియడంతో మావటూరు, నాగళూరు, సానిపల్లి, బండపల్లి గ్రామాల ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం ఉదయం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
దీంతో పెనుకొండ నుంచి మడకశిర వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బస్‌షెల్టర్‌ను కూల్చిన జ్యోతీను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని, కూల్చిన బస్ షెల్టర్ స్థానంలో నూతన షెల్టర్ కట్టించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు.
బస్‌షెల్టర్ కూల్చిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆందోళన విరమించారు. అనంతరం సర్పంచ్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ నాగభూషణ్‌రెడ్డి, ఎంపీటీíసీ శివయ్య, మోహన్, మాజీ డీలర్ శ్రీనివాసులు, మేకల మారుతి, నరసింహ, పీజే రాజశేఖర్, శివారెడ్డి, మురళీ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. జ్యోతీష్, జేసీబీ డ్రైవర్‌పైన కేసు నమోదు చేశామన్నారు.
మంత్రి అండతోనే కూల్చివేత
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అండతోనే జ్యోతీష్ బస్òÙల్టర్ కూల్చేశాడని వైఎస్సార్‌సీపీ మండల కనీ్వనర్ సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం బస్ షెల్టర్ ఉన్న స్థానంలో కాంప్లెక్స్ నిర్మాణం కోసం గతంలోనే జ్యోతీష్ తనను, సర్పంచ్ నాగరాజును అనుమతులు అడగ్గా తాము అంగీకరించలేదని ఆయన వెల్లడించారు.


