మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక బడా స్కాం: గోపిరెడ్డి | Gopireddy Srinivasa Reddy Objects CBN Medical Colleges Privatization | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక బడా స్కాం: గోపిరెడ్డి

Nov 29 2025 5:08 PM | Updated on Nov 29 2025 6:07 PM

Gopireddy Srinivasa Reddy Objects CBN Medical Colleges Privatization

సాక్షి, తాడేపల్లి: మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో టీడీపీ నేతలకు కట్టబెట్టి వందల కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీ భూముల్ని కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారాయన. 

శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక స్కాం ఉంది. టీడీపీ నేతలకు కాలేజీలను కట్టబెట్టి వందల కోట్లు దోచుకుంటున్నారు. మెడికల్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం అమ్ముకోవడానికి రెడీ అయ్యింది. మెడికల్ కాలేజీలను 66 సంవత్సరాలు లీజుకు ఇవ్వటానికి జీవోలు ఇచ్చారు..

తరతరాలుగా తమ వారికి దోచిపెట్టే ప్లాన్ చేశారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీల భూములను కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారు. ఏ ప్రైవేట్‌ మెడికల్ కాలేజీ అయినా సరే జగన్ కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలాగా ఉన్నాయా?. అత్యద్భుతంగా జగన్ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే చంద్రబాబు వాటిని సింపుల్‌గా అమ్మేస్తారా?. 

దేశంలో ఎక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయలేదు. కానీ చంద్రబాబే ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్‌ వారికి ఇచ్చాక కూడా స్టాఫ్‌కి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట.. ఏంటసలు?. ఒక పేదవాడు అత్యవసర వైద్యం కోసం వస్తే వైద్యం చేసే పరిస్థితి ఉంటుందా?. ఒకవేళ ఆస్పత్రి 70% ఫుల్ అయిందని చెప్పి వెనక్కు పంపితే ఆ పేదోడు బతికేదెలా?. 

వైద్య విద్య మీద ఈ ప్రభుత్వం సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదా?. ఇప్పటికే చంద్రబాబు వైఖరి వల్ల 2,750 మెడికల్ సీట్లు కోల్పోయాం. పాడేరు మెడికల్ కాలేజీ విషయంలో 50 సీట్లు కోల్పోయాం. ఇటీవల ఆ ప్రాంతంలో గర్భిణులు, హాస్టల్ విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడ్డారో కనపడలేదా?. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మంచి స్పందన వస్తోంది. మేం అధికారం చేపట్టాక ప్రైవేటీకరించిన మెడికల్‌ కాలేజీలను తిరిగి స్వాధీనం చేసుకుని తీరతాం అని అన్నారాయన. 

Advertisement
 
Advertisement
Advertisement