వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌.. హైలైట్స్‌ | YS Jagan Press Meet Today Latest News Updates Highlights | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌.. హైలైట్స్‌

Jan 22 2026 10:34 AM | Updated on Jan 22 2026 7:00 PM

YS Jagan Press Meet Today Latest News Updates Highlights

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు క్రెడిట్‌ చోరీ, పల్నాడు గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో జరిగిన దారుణ ఘటన..  తదితర అంశాలపై పలు కీలక విషయాలను ఆయన వివరించారు. 

జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌

  • భూమండలం మీద క్రెడిట్‌ చోరీ చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు

  • ఊసరవెల్లి కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడుతుంది. అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నారాయన

  • రైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన కూడా ఆయనకు లేదు

  • భూముల రీసర్వే చేయాలన్న ఆలోచన కూడా బాబుకు ఏనాడూ రాలేదు

  • రీసర్వే ఆలోచన నాకు నా పాదయాత్రలోనే వచ్చింది

  • రైతన్నలు లేవనెత్తిన సమస్యల నుంచి పరిష్కారమే రీసర్వే

  • మేం అధికారంలోకి రాకముందు సర్వేయర్లు లేరు

  • భూములు సర్వే చేసే టెక్నాలజీ కూడా లేదు

  • సవాలక్ష భూ సమస్యలకు పరిష్కారం చేయడమే రీసర్వే

  • 22ఏలో భూములు పెట్టడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు

  • వందేళ్ల కిందట బ్రిటీషర్లు  భూ సర్వేలు చేశౠరు
  • మేం అధికారంలోకి వస్తే సమగ్ర భూసర్వే చేయిస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టాం
  • చెప్పినట్లుగానే.. 2020 డిసెంబర్‌ 21న భూ రీసర్వే మొదలుపెట్టాం
  • సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయం ప్రారంభించాం
  • భూ సర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం
  • వివాదాలు లేని విధంగా పాదర్శకంగా భూములు రీసర్వే చేశాం
  • రికార్డులు ట్యాంపర్‌ చేయలేని విధంగా సంస్కరించాం
  • భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చాం
  • ప్రభుత్వం పూచీకత్తుగా పత్రాలు రైతులకు అందించాం
  • అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో రైతులకు పాస్‌బుక్‌లు ఇచ్చాం.. ఆ పాస్‌బుక్కుల్లో క్యూఆర్‌ కోడ్‌ పెట్టాం
  • నాలుగుసార్లు సీఎంగా ఉండి..  80 పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా?
  • చంద్రబాబు ఇలాంటిది ఏనాడైనా విన్నావా? చూశావా? చేశావా?
  • సమగ్ర సర్వే చేసిన మేం చేసిన ప్రతీది రికార్డే.. ఇది ఎవరూ తుడిచిపెట్టలేనిది

 

  • గ్రామాల్లో సచివాలయాలు నిర్మించాం. వాటిల్లో పది మంది చొప్పున సిబ్బందిని నియమించాం. 
  • సర్వే కోసం రికార్డు స్థాయిలో సిబ్బందిని పురమాయించాం.  
  • సుమారు 40 వేల మంది సిబ్బంది శ్రమ, కృషి దాగుంది ఈ మహాయజ్ఞంలో. టెక్నాలజీపై అవగాహన కోసం వీళ్లకు శిక్షణ ఇప్పించాం. 
  • సర్వే ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. 
  • సర్వేలో హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించాం. డ్రోన్‌లతో సర్వే జరిగింది మా హయాంలోనే. 
  • కోట్ల సర్వే రాళ్లను గ్రామాలను తరలించాం. వాటిని ఉచితంగా రైతులకు ఇచ్చాం. వాటిపై భూసర్వే-భూరక్ష అని రాయించాం. 5 సెం.మీల తేడా లేకుండా సర్వే జరిపాం. 
  • విదేశాల్లో కూడా చేయలేని ప్రయత్నాలు చేశాం. ఇది మహా యజ్ఞం అంటే.. 
  • భూముల రీసర్వేకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేశాం. 
  • ఈ కృషిని మెచ్చి కేంద్రం ప్లాటినమ్డ్‌ గ్రేడ్‌ ఇచ్చింది. మా పని వల్ల కేంద్రం నుంచి రూ.400 కోట్ల రాయితీ వచ్చింది. కానీ చంద్రబాబు అదంతా తన వల్లే అని చెప్పుకుంటున్నారు
  • 2023 డిసెంబర్‌లో పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమే ఈ ప్రకటన చేసింది
Survey Stone: 30 లక్షల మంది రైతులకు ఇదొక వరం..

 

  • భూముల రీసర్వేను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది
  • కేరళ, ఉత్తరాఖండ్‌ అధికారులు సర్వేను అధ్యయనం చేశారు
  • మహరాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి ప్రశంసించారు
  • అసోం కూడా మా సహకారం కోరింది
  • సర్వే ఆఫ్‌ ఇండియా అప్పటి డైరెక్టర్‌ మేం చేపట్టిన సర్వేను మెచ్చుకున్నారు
  • చంద్రబాబుది రాక్షస పాత్ర.. ఎల్లో మీడియాది అసిస్టెంట్‌ రాక్షస పాత్ర
  • ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ఎన్నికల సమయంలో రైతులను భయపెట్టారు
  • దుష్ప్రచారంతో భూ సర్వే క్రెడిట్‌ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు
  • నిజాలను ఎంతో కాలం దాచిపెట్టలేరు

 

  • సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు
  • ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు
  • పాస్‌ బుక్‌ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతే
  • ట్యాంపర్‌ చేయలేని పాస్‌బుక్‌లు ఇవ్వాలన్నదే మా తపన
  • పైగా వాటిల్లో విపరీతమైన తప్పులు ఉంటున్నాయి
  • మేం పాతిన రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తున్నారు.. ఇందుకోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు
  • సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది చంద్రబాబు సర్కార్‌ వ్యవహారం
  • సర్వే అంతిమ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది చంద్రబాబు సర్కార్‌
YS Jagan : 5 CM తేడా లేకుండా కొలతలు వేశాం.. ఇది మన విజన్..

 

  • 22 ఏ గురించి చంద్రబాబు మాట్లాడితే ఆశ్చర్యమేస్తోంది
  • 22 ఏలో అడ్డగోలుగా భూములు పెట్టిన చరిత్ర బాబుదే
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌‌ సేవలు గాలికొదిలేశారు
  • రూ.55.79 మేం పట్టాదారు‌ పాస్‌బుక్‌కు ఇస్తే.. చంద్రబాబు రూ.76 ఇస్తున్నారు
  • కమీషన్లు తీసుకుని పట్టదారు పాస్‌బుక్‌లు ఇస్తున్నారు

 

  • చుక్కల భూముల సమస్యలను కూడా మేం పరిష్కరించాం. 
  • ఇనాం భూములపై లక్షా 60 వేల మందికి హక్కులు కల్పించాం. 
  • 1.54 లక్షల ఆదివాసీలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించాం
  • చంద్రబాబు ఇవేవీ చేయకపోగా.. అదంతా తన పనిగా చెప్పుకుంటున్నారు

 

  • చంద్రబాబు, ఆయన ఎల్లో ముఠా.. రాక్షసుల కంటే దారుణంగా ఉన్నారు
  • పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దారుణం జరిగింది
  • ప్రజలు ఊర్లు విడిచి వెళ్లాల్సిన పరిస్థితికి రెడ్‌బుక్‌ రాజ్యాంగం చేరింది.. ఇది సిగ్గుపడాల్సిన పరిస్థితి
  • ఊరిలో తిరిగి అడుగుపెట్టడానికి ప్రజలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు 
  • రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని చంద్రబాబు దగ్గరుండి ప్రొత్సహిస్తున్నారు. 
  • సాల్మన్‌ ఒక దళితుడు.. ఒక సామాన్యుడు. 
  • తన భార్య అనారోగ్యం బారిన పడిందని సొంత గ్రామం పిన్నెల్లి వెళ్తే.. సాల్మన్‌ను రాడ్లతో కొట్టి చంపేశారు.
  • చికిత్స పొం‍దుతూ ఆ మనిషి చనిపోతే.. కనీసం మృతదేహాన్ని ఊరిలోకి కూడా రానివ్వలేదు. 
  • మా పార్టీ నేతలు పోరాడితేగానీ అంత్యక్రియలకు అనుమతించలేదు. 
  • తన పాలనలో చంద్రబాబు విషపు గింజలు నాటాడు. 
  • చంద్రబాబు చెడ్డ అలవాట్లు ఉన్న వ్యక్తి . 
  • పిన్నెల్లి ఘటనలో.. సీఐ, ఎస్సైలు, ఎస్సీ, ఎమ్మెల్యే, చంద్రబాబు కూడా దోషే. 
  • ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు. ఇది ఆయన గుర్తిస్తే మంచిది. 
  • పిన్నెల్లి ఉదంతంపై కోర్టులను.. మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తాం

 

  • కూటమి వచ్చాక.. రాష్ట్రంలో వాడవాడలా బెల్ట్‌ షాపులు వెలిశాయి
  • ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు
  • ఉచిత ఇసుక పేరుతో దోచేస్తున్నారు
  • మా హయాంలో ఇసుకతో రూ.750 కోట్ల ఆదాయం ప్రతీ ఏడాది వచ్చేది
  • కూటమి ప్రభుత్వంలో మైనింగ్‌ దోపిడీ జరుగుతోంది
  • దోపిడీలో కింద నుంచి పైవరకు వాటాలు వెళ్తున్నాయి
  • ప్రైవేట్‌ వాళ్లకు భూములు ఇవ్వడమేకాదు.. నిర్మాణ ఖర్చులూ ఇస్తున్నారు
  • భూములు ఇవ్వడమే పెద్ద స్కామ్‌.. నిర్మాణ ఖర్చులనేది ఇంకా పెద్ద స్కామ్‌
  • అమరావతిలో నిర్మాణాల పేరుతో జరిగేది ఏంటి? నిర్మాణాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? 
  • సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి జూదాలను నడిపించారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో ఇది జరిగింది. 
  • ఈ తతంగంతో సుమారు రూ.2 వేల కోట్ల రొటేషన్‌ జరిగింది. 
  • జూదం అనేది చట్టబద్దమా?. ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి వాటిని ప్రొత్సహించడమేంటి?. ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకోవడం కిందకు రాదా?.. ఇది అవినీతి కిందకే వస్తుంది కదా.. లూటీ కదా!.. 
  • రాష్ట్రంలో మేం తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేదనే విషయాన్ని అంతా గుర్తించాలి 
  • సభలో మైక్‌ ఇచ్చే పరిస్థితులు లేనందునే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయాల్సి వస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement