స్కిల్‌ స్కామ్‌ కేసు అలా ముగిసింది.. | Know How Chandrababu Naidu Closed His Skill Development Scam Case, Sparks Political Controversy Check Details Here | Sakshi
Sakshi News home page

స్కిల్‌ స్కామ్‌ కేసు అలా ముగిసింది..

Jan 13 2026 9:32 AM | Updated on Jan 13 2026 9:50 AM

How Chandrababu Close His Skill Scam Case Check Details Here

సాక్షి, విజయవాడ: అధికార దుర్వినియోగంలో చంద్రబాబు అరుదైన ఘనత సాధించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నంలో వరుస విజయాలు సాధించుకుంటూ పోతున్నారు. నిందితుడిగా 53 రోజులపాటు జైలు శిక్ష అనుభవించిన స్కిల్‌ స్కామ్‌ కుంభకోణం కేసును మొత్తానికి క్లోజ్‌ చేయించుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న స్కిల్‌ స్కామ్‌ కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సీఐడీ తుది నివేదికను కోర్టులో ఫైల్‌ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. చివరకు ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’గా పరిగణిస్తూ ఈ తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు సహా 35 మందికి ఊరట దక్కినట్లయ్యింది.

ఆంధ్రప్రదేశ్‌లో 2014–2019 చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2018లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. 2023కల్లా ఈ కేసు దర్యాప్తు ముమ్మర స్థాయికి చేరుకుంది. స్కామ్‌ జరిగిన మాట వాస్తవమేనని తేల్చింది. ఫేక్‌ కంపెనీల ద్వారా సుమారు రూ.371 కోట్ల నిధులు మళ్లించబడ్డాయని నిర్ధారించింది. అలా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిందితుడిగా పేర్కొంటూ సెప్టెంబర్‌ 9, 2023లో అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కేసు దర్యాప్తులో ఉండడంతో కోర్టు బెయిల్‌ నిరాకరించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా గడిపారు. ఆ సమయంలో ఆయన్ని సీఐడీ కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది కూడా. మరోవైపు.. ఈ కేసును ఈడీ సైతం విచారణ జరిపి పలువురి ఆస్తులను సైతం జప్తు చేసింది. అనారోగ్య కారణాలు చూపిస్తూ 53 రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక కేసు కొట్టేయించుకోవడానికి సీఐడీతో పిటిషన్‌ వేయించారు. 

గతంలో స్కిల్‌ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఏపీ సీఐడీ.. ఇప్పుడు ఇంత తీవ్రమైన కేసులో ఏమాత్రం నేరం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొనడం గమనార్హం. ఇటు చంద్రబాబు అధికార దుర్వినియోగంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కేసులు మూయించుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement