సాక్షి, వైఎస్సార్ జిల్లా: నోరు తెరిస్తే వ్యవసాయం దండుగ అంటున్న సీఎం చంద్రబాబు నాయుడికి ఓ రైతు సూటి ప్రశ్నలతో చురకలు అంటించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బ్రహ్మణపల్లి పర్యటనలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రైతు ఉత్సాహం గమనించిన వైఎస్ జగన్ మీడియా ముందు మాట్లాడాలని కోరారు.
‘‘అయ్యా చంద్రబాబూ.. మాట్లాడితే వ్యవసాయం దండగ, వ్యవసాయం దండగ అంటున్నావ్ కదా. నువ్వేమైనా ఇనుప ముక్కలు తిని బతుకుతున్నావా?. రైతులంతా కన్నెర్ర చేస్తే ఏం తిని బతుకుతావ్?. దేశానికి రక్షణ ఎంత అవసరమో.. రైతు కూడా అంతే ముఖ్యం. పసిపిల్ల పాల దగ్గరి నుంచి ప్రతీది రైతు మీద ఆధారపడి బతకాల్సిందే. అలాంటిది.. రైతును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావ్?’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


