చంద్రబాబు, లోకేష్‌ డైరెక్షన్లోనే ఇదంతా..! | YSRCP Leaders Condemns Attack on Ambati Rambabu House | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేష్‌ డైరెక్షన్లోనే ఇదంతా..!

Feb 1 2026 12:43 PM | Updated on Feb 1 2026 5:55 PM

YSRCP Leaders Condemns Attack on Ambati Rambabu House

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఆటవిక పాలనలో వైఎస్సార్‌సీపీ నేతలకు భద్రత లేకుండా పోయిందని.. పట్టపగలే టీడీపీ నేతలు గూండాగిరికి దిగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని.. ఆ పార్టీ మండిపడుతోంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో.. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నమే ఉదాహరణ అని అంటున్నాయి.  ఈ క్రమంలో ఆయనపై అక్రమ కేసును బనాయించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు ఆ పార్టీ నేతలు..   

శ్రీకాకుళం:
తాలిబాన్ పాలనలా.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్‌
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాడులు.. తప్పుడు కేసులు
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ ఉందా?
అంబటిపై హత్యాయత్నం దారుణం
చంద్రబాబు 40 ఏళ్ల అనుభవంతో ఏపీని ఆటవిక ప్రదేశ్‌గా మార్చారు
తిరుమల లడ్డులో యానిమల్ ఫ్యాట్ లేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది
ఇప్పుడు కూటమి నేతలు సీబిఐ రిపోర్ట్ తప్పు అంటూ మాట్లాడుతున్నారు
హోమంత్రి సైతం సిట్ రిపోర్ట్ తప్పు అంటుంది.. అంటే సీబీఐ అయితే తప్పు మీ సిట్ అయితేనే కరెక్టా.. ఎంత దౌర్భాగ్యం
చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడడం కోసమే మంత్రులు ఇలా మాట్లాడుతున్నారు
అబద్దపు ప్రచారాలతో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారు
పోలీసులు నేతలకు భయపడి ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు.
కర్రలతో తిరుగుతుంటే.. కనీసం పోలీసులు అడ్డుకోలేకపోయారు.. తాలిబాన్ పాలనలా ఉంది
పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు 

తూర్పుగోదావరి..  

రాష్ట్రంలో పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?.. హిట్లర్ పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుంది

ఎన్నికలు పూర్తయిన నాటినుంచి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు అంతమొందిచాలనే ప్రయత్నం జరుగుతుంది ఆలోచనతోనే వ్యవస్థ నడుస్తోంది

పోలీసులు గుప్పెట్లో పెట్టుకుని  అరాచకం సృష్టిస్తున్నారు

టీటీడీ వైభవాన్ని కూడా రాజకీయ స్వప్రయోజనాల కోసం మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు

దేశంలో ప్రధానమైన ల్యాబ్‌లలో జరిగిన పరీక్షల్లో..  తిరుమల లడ్డూలో ఎటువంటి కొవ్వు కలవలేదనే  స్పష్టమైన రిపోర్ట్ వచ్చాయి

దీంతో చంద్రబాబు నియంతలా మారి హింసకు పాల్పడుతున్నారు

వరుసగా.. విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, అంబటి రాంబాబు లపై దాడులు చేశారు

అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి వాహనాలను పగలగొట్టి దగ్ధం చేశారు. 

అంబటి రాంబాబును అంతమందించాలని కుట్రకు చంద్రబాబు లోకేష్ దగ్గర ఉంటే డైరెక్షన్ ఇచ్చారు.  

స్థానిక మహిళా ఎమ్మెల్యే కూడా దగ్గరుండి ఈ విధ్వంసం సృష్టించారు

రానున్న రోజుల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది...

ప్రజల్లో ఆగ్రహం వస్తే ఏ వ్యవస్థ అడ్డుకోలేదు..

చంద్రబాబు కాపులను ఎప్పుడూ ఓట్ల కోసం ఉపయోగించుకుంటాడు

ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి కాపు నాయకులను తొక్కేసే ప్రయత్నం చేస్తారు

రాష్ట్రంలో బలమైన నాయకుడుగా ఎదుగుతున్న వంగవీటి రంగాను నడి రోడ్డుపై నరికేసే పైసాచికానందం పొందారు

ఎన్నికల హామీల నెరవేర్చమని అడిగిన ముద్రగడ పద్మనాభ ఇంటిపైకి వేలమంది పోలీసులను పంపి మహిళలను అనరాని మాటలు మాట్లాడి ఈడ్చుకెళ్లారు..

చంద్రబాబు లోకేష్ ల డైరెక్షన్లోనే అంబటి ఇంటిపై దాడి జరిగింది.. ఇది సహించదగినది కాదు..

కుట్రకు డైరెక్షన్ ఇచ్చిన వారినుంచి  ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరిపై కేసులు నమోదు చేయాలి

రాష్ట్రంలో అటవీక పాలన నడుస్తుంది

రాష్ట్రంలో పోలీసులకు ప్రభుత్వం జీతాలు ఇస్తుందా? ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి  ఇస్తున్నారా?

ఎక్కడపడితే అక్కడ కేసులు పెట్టి సోషల్ మీడియా వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు

కార్యకర్తలకు కత్తులు, కర్రలు ఇచ్చి మేము చూసుకుంటాం అని చెప్పటం సరికాదు...

డీజీపి స్పందించాలి... కనీసం ఫోన్ కూడా ఎత్తకపోవడం దారుణం...

చంద్రబాబే అధికారంలో శాశ్వతంగా ఉంటారని అనుకుంటున్నారేమో!

2029 లో వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటి?

మీరు చేసే ప్రతి తప్పు కౌంట్ అవుతుంది...

అవసరమైతే జైల్ భరోలా.. పోలీస్ స్టేషన్ భరో చేస్తాం

కాపు నాయకులను అడగదొక్కేందుకు  ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అందరు గమనించాలి

అంబటి రాంబాబు కు మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు వెళదామంటే మా ఇంటి ని  పోలీసులు చుట్టుముట్టారు

:::మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

ఢిల్లీ

  • అంబటి రాంబాబు పై హత్యాయత్నం పై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నాం
  • ఫస్ట్ టీడీపీ వాళ్ళే అంబటి రాంబాబు పై దాడి చేసి పచ్చి బూతులు తిట్టారు
  • ఇది వరకు నాపై దాడి చేసినప్పుడు ఒక్క కేసు పెట్టలేదు

-ఎంపీ మిథున్ రెడ్డి


తిరుపతి:

అంబటి పై నిన్న జరిగిన దాడి  ప్రజాస్వామ్యం పై దాడి

ఇరు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు మాజీ మంత్రి అంబటి పై దాడి అత్యంత హేయమైనది, నీచ మైనది

అంబటి ఇంటిపైకి టీడీపీ నేతల్ని జల్లికట్టులో ఎద్దుల్లా వదిలారు.. అంబటి పై హత్యాయత్నం చేశారు

తాను చేసిన వ్యాఖ్యలకు అంబటి వివరణ కూడా ఇచ్చారు

అయినా పోలీసులు సమక్షంలో టీడీపీ బరితెగించించింది 

ప్రతీకార ద్వేషంతో హంతకముఠా దాడులు చేస్తోంది

ప్రతి మండల కేంద్రంలో లడ్డూ వివాదంలో ఫ్లెక్సీలు పెట్టించారు

కాపు నాయకులపై  దాడి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది

::భూమన కరుణాకర్‌రెడ్డి

 

న్యూఢిల్లీ..

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు జరిపిన దాడిని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారాయన. ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పనితీరు రాక్షస పాలనను తలపిస్తోంది. టీడీపీ గుండాలు, కార్యకర్తలు వేల సంఖ్యలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. దాదాపు 5 గంటల పాటు వీరంగం సృష్టించి ఇంటిని ధ్వంసం చేశారు. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. కనీసం దాడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. మా అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సూచనల మేరకు.. రాష్ట్ర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒక మాజీ మంత్రికే ప్రాణ రక్షణ కరువైందన్న విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు, ఆ శాఖ కార్యదర్శికి కలిసి వివరిస్తాం అని అన్నారాయన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement