సాక్షి, అమరావతి: ఇవాళ మంగళవారం. షరా మామూలుగా కూటమి సర్కార్ చేయాల్సింది చేసింది. అయితే తాజా అప్పుతో సరికొత్త రికార్డు సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తిరగకుండానే.. ఏపీ అప్పు రూ.3 లక్షల కోట్లకు చేరింది.
వారం కిందటే రూ.4 వేల కోట్ల అప్పు చేసిన బాబు సర్కార్(డిసెంబర్ 31 నాటికి 2,93,269 కోట్ల అప్పులు).. ఇవాళ మరో రూ.6,500 కోట్ల అప్పు తెచ్చింది. తద్వారా అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ, అత్యధిక అప్పులు చేస్తోన్న సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. వీటిల్లో..
బడ్జెటరీ అప్పులు రూ. 1,71,637 కోట్లు కాగా, . బడ్జెట్ బయట అప్పులు రూ.1,27,632 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు కాగ్ నిర్ధారించిన అప్పు రూ.81,597 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు కాగ్ నిర్ధారించిన అప్పు రూ.77,040 కోట్లుగా ఉంది. ఆ అప్పుల చిట్టాను ఓసారి పరిశీలిస్తే..
డిసెంబర్‌లో..
డిసెంబర్ 2న తెచ్చిన అప్పులు రూ.3,000 కోట్లు
డిసెంబర్ 30న తెచ్చిన అప్పు రూ.4,000 కోట్లు
జనవరి 6న తెచ్చిన అప్పు రూ.6,500 కోట్లు
- బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా రూ.80,245 కోట్లు అప్పు
- ఏపీ మార్క్ ఫెడ్ 19,900 కోట్లు
- జలజీవన్ మిషన్ కార్పొరేషన్ 10,000 కోట్లు
- ఏపీఎండీసీ 9,000 కోట్లు
- ఏపీఐఐసీ 8,500 కోట్లు
- పౌరసరఫరాల సంస్థ 7,000 కోట్లు
- ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు
- ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ (బాండ్లు) 5,750 కోట్లు
- ఏపీసీపీడీసీఎల్, ఏపీ ఎస్ పి డిసి ఎల్ 5,473 కోట్లు
- నాబార్డు నుండి డిస్కమ్స్ 3,762 కోట్లు
- ఎస్ బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్లు
- బ్యాంకుల నుండి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు
- ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000 కోట్లు
- అమరావతి పేరుతో 47,387 కోట్లు అప్పులు
- ప్రపంచ బ్యాంకు, ఎడిబి ద్వారా 15,000 కోట్లు
- హడ్కో ద్వారా అప్పు 11,000 కోట్లు
- ఎన్ ఏ బి ఎఫ్ డి ద్వారా 7,500 కోట్లు
- నాబార్డు ద్వారా అప్పు 7,387 కోట్లు
- కే ఎఫ్ డబ్ల్యూ అప్పు 5,000 కోట్లు
- ఏ పీపీ ఎఫ్ సీఎల్ 1500 కోట్లు

జగన్ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారం
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లప్పులు చేసిందని, ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో ఆ అప్పును రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. చివరికి బడ్జెట్‌కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లుగా చెప్పారు. చివరాఖరికి.. జగన్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3,39,580 కోట్లు మాత్రమేనని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని స్వయంగా ఆర్థిక మంతత్రి పయ్యావుల అసెంబ్లీలో చేసిన ప్రకటన బాబు దుర్మార్గమైన ప్రచారాన్ని బద్ధలు కొట్టింది.


