ఉన్నమాటతో ఉలికిపడుతున్న చంద్రబాబు! | Chandra Babu Govt Dilemma After YS Jagan Hello India Tweet | Sakshi
Sakshi News home page

ఉన్నమాటతో ఉలికిపడుతున్న చంద్రబాబు!

Dec 2 2025 10:16 AM | Updated on Dec 2 2025 10:25 AM

Chandra Babu Govt Dilemma After YS Jagan Hello India Tweet

సాక్షి, తాడేపల్లి: ‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడండి! అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన ట్వీట్‌ సంచలనం రేపుతోంది. ఏపీలో రైతుల దుస్థితి తెలుపుతూనే.. సేవ్ ఏపీ ఫార్మర్స్ (#SaveAPFarmers) పేరుతో సదీర్ఘమైన పోస్ట్‌ ఒకటి ఉంచారాయన. 

అయితే.. జగన్ ట్వీట్‌తో చంద్రబాబు ప్రభుత్వం భుజాలు తడుముకుంటోంది. సాధారణంగా జగన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టినా.. ఏదైనా ట్వీట్‌ చేసినా వెంటనే మీడియా ముందుకు వచ్చి అబద్ధపు ప్రకటనలు చేయడం టీడీపీ అండ్‌ కోకు అలవాటుగా మారింది. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలు సరైనవి కావడం, పైగా కళ్ల ముందు ప్రత్యక్షంగా పరిస్థితులు కనిపిస్తుండడంతో ఖండించలేని స్థితిలో ఉండిపోయింది.  మరోవైపు.. 

కిలో అరటిపండ్లను రైతుల నుండి కొంటున్నది కేవలం 50 పైసలకే!. ఒక అగ్గిపెట్టె, ఒక బిస్కెట్ కంటే కూడా అరటిపండ్లు చౌక. అనంతపురం కలెక్టరేట్‌ను అరటి రైతులు ముట్టడించడాన్ని ప్రధానంగా ఉద్దేశిస్తూ వైఎస్‌ చేసిన ట్వీట్‌లో మచ్చుకు రెండు లైన్లు మాత్రమే. అవి వాస్తవాలు కావడంతో ఎలా కవరింగ్‌ చేసుకోవాలో అర్థంకాక ఇటు ఎల్లో మీడియా అవస్థలు పడుతోంది. 

లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. నెలల తరబడి కష్టపడి వ్యవసాయం చేస్తే.. చివరికి రైతులకు దక్కే ప్రతిఫలం ఇదేనా? అంటూ జగన్‌ ప్రశ్నిస్తున్నారు. ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొంటూ ఏపీ అన్నదాతలు అవస్థలను దేశం దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement