టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’! | TDP MLA MS Raju Faces Public Backlash As Public Protest Over Drinking Water Shortage, More Details Inside | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

Jan 27 2026 9:14 AM | Updated on Jan 27 2026 10:30 AM

Madakasira TDP MLA MS Raju Negligence On Water Issue

సాక్షి, శ్రీ సత్యసాయి: ఆయనో ఎమ్మెల్యే. ఆ పార్టీ జిల్లాకు అధ్యక్షుడు కూడా. ఈ రెండే కాకుండా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యుడిగానూ ఉన్నాడు. అందుకేనేమో నియోజకవర్గంలో ప్రజలు గుక్కెడు నీటి కోసం రోడ్డెక్కుతుంటే పట్టించుకునే తీరికలో లేడేమో అంటూ సెటైర్లు పేలుతున్నాయి. 

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. ఎండకాలం ఇంకా రాక మనుపే.. తాగునీటి సమస్యలతో నియోజకవర్గ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వరుసగా.. బేగార్లపల్లి, వడ్రపాళ్యం, కొడగార్లగుట్ట, కూగిరినపాళ్యం, జమ్మలబండ, రాళ్లపల్లి గ్రామాల్లో మహిళల నిరసనలు చేపట్టారు. తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

 

గత కొన్నిరోజులుగా మడకశిరలో ఖాళీ బిందెలతో బైఠాయించి మహిళలు నిరసన తెలుపుతున్నారు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని, తమ కన్నీటి కష్టాలు తీర్చే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట తాగునీటి కోసం ఆందోళన జరుగుతునే ఉన్నాయంటున్నారు.  

తాజాగా.. బోరు మోటర్‌ చెడిపోవడంతో మడకశిర పట్టణంలోని 18వ వార్డుకు 15 రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. ప్రతి రోజూ మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లడం, కనిపించిన ప్రతి అధికారినీ వేడుకోవడం మామూలైపోయింది. దీంతో రిపబ్లిక్‌ డే నాడు.. మహిళలంతా ఖాళీబిందెలతో రోడ్డెక్కారు. బేగార్లపల్లి క్రాస్‌లోని హిందూపురం ప్రధానరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గంటసేపు ఆందోళన చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.  విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ లావణ్య వెంటనే అక్కడికి చేరుకుని మహిళలతో చర్చించారు. అధికారులతో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించి ఆందోళన విరమించారు. 

రెండు రోజుల క్రితం రొళ్ల మండలంలోని కేజీగుట్ట, కొడగార్లగుట్ట గ్రామాలకు చెందిన మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. అదే విధంగా మడకశిర పట్టణంలోని వడ్రపాళ్యంలో తాగునీటి సమస్యపై మహిళలు హిందూపురం ప్రధానరోడ్డుపై నిరసన తెలిపారు. గుడిబండ మండలం ఎస్‌ఎస్‌ గుండ్లులో కూడా మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని నిరసన తెలిపారు.

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో చిన్నచిన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయి. ప్రజల సమస్యలపై దృష్టిసారించకుండా.. అనవసర విషయాలపై ఎమ్మెల్యే ఆర్భాటం ఎక్కువైందని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement