Live Updates
మేం మంచి చేస్తే.. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు: వైఎస్ జగన్
కేజీహెచ్‌కు వైఎస్ జగన్
విశాఖ:
- కేజీహెచ్‌కు చేరుకున్న వైఎస్ జగన్
- పచ్చకామెర్ల బాధిత విద్యార్థినులకు పరామర్శ
- మీడియాపై ఆంక్షలు
- వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌కు అనుమతి నిరాకరణ
- వైఎస్ జగన్‌తో మీడియా మాట్లాడకూడదంటూ ఆంక్షలు
- కేజీహెచ్ వద్ద శంక బ్రత బాగ్చీ ఓవరాక్షన్
నర్సీపట్నం మెడికల్ కాలేజ్‌ను సందర్భించిన వైఎస్ జగన్
నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ..
- మా హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం
- ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీ చేస్తే.. తట్టుకోవడం పేదవాళ్లకు అసాధ్యం
- అందుకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది
- అలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు.
- అంతా ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా?

- పేదవారు దగా పడకుండా ఎలా ఆపుతారు
- పేదవాళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 17మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చాం
- నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం
- కోవిడ్ సంక్షోభంలోనూ రూ.500కోట్లు ఖర్చు చేశాం
- ఈ మెడికల్ కాలేజీలో పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందేది
- ఏడాదికి 150 మెడికల్ కాలేజీ సీట్లను అందుబాటులోకి తెచ్చాం
- అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుంది
- చంద్రబాబు పేదవాడికి అన్యాయం చేస్తున్నారు
- విజయనగరం,పాడేరు మెడికల్ కాలేజీలు క్లాసులు ప్రారంభమయ్యాయి
- చంద్రబాబును అడుగుతున్నాం.. చంద్రబాబు ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీల పరిస్థితులు ఇవి
- మెడకల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదవాడికి మంచి ఎలా జరుగుతుంది?
- మేం మంచి చేస్తే.. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
నర్సీపట్నం మెడికల్ కాలేజీకి చేరుకున్న వైఎస్ జగన్
- నర్సీపట్నం, మాకవరపాలెంలో కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన
- తండోపతండాలుగా తరలివస్తున్న జనం
- ప్రతిచోటా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్
- బల్క్ డ్రగ్ వద్దు.. ప్రజలు ప్రాణాలే ముద్దంటూ ప్లకార్డులను ప్రదర్శించిన వైఎస్ జగన్

భారీ వర్షంలోనూ వైఎస్ జగన్ పర్యటన
- భారీ వర్షంలోనూ పర్యటన కొనసాగిస్తున్న వైఎస్ జగన్
- అనకాపల్లి జిల్లా కొత్తూరు జంక్షన్ లో భారీ వర్షం
- భారీ వర్షంలోనూ తగ్గేది లేదు అంటున్న జగన్.. అభిమానులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా జగన్‌కు సంఘీభావం
అనకాపల్లి జిల్లా: తాళ్ళపాలెం జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్
ఉరుములతో కూడిన భారీ వర్షం
వర్షాన్ని లెక్కచేయకుండా జగన్‌కు ఘనస్వాగతం పలుకుతున్న అభిమానులు

అనకాపల్లిలో పడుతున్న భారీ వర్షం..
భారీ వర్షంలో వైఎస్ జగన్ కోసం ఎదురుచూస్తున్న రాజయ్య పేట మత్స్యకారులు..

అనకాపల్లి జిల్లా పర్యటనలో వైఎస్ జగన్
మరికాసేపట్లో తాళ్ళపాలెం జంక్షన్ చేరుకోనున్న వైఎస్ జగన్
వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివస్తున్న అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

వైఎస్ జగన్‌ను కలిసిన న్యాయవాదులు..
- విశాఖ..
- గోపాలపట్నంలో వైఎస్ జగన్ కలిసిన అడ్వకేట్స్.
- తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించిన అడ్వకేట్స్.

వైఎస్ జగన్‌ను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
- వైఎస్ జగన్‌ను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
- స్టీల్ ప్లాంట్ కార్మికులు వైఎస్ జగన్‌ను కలిశారు.
- ఈ సందర్బంగా తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
- స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.

వైఎస్ జగన్‌ను కలిసేందుకు వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు..
- వైఎస్ జగన్‌ను కలిసేందుకు వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు.
- నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు తరలి వచ్చారు.
- జి.భీమవరం వద్ద పోలీసులు.. మత్స్యకారులను అడ్డుకున్నారు.
- వైఎస్ జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదన్న పోలీసులు.
- వైఎస్ జగన్‌ను కలిసి తీరుతామని స్పష్టం చేసిన మత్స్యకారులు.
- కూటమి నేతలను నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువునా మోసం చేశారని గంగపుత్రుల ఆవేదన
- కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దన్న మత్స్యకారులు.

విశాఖ ఎయిర్‌పోర్టుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు..
- విశాఖ నుంచి నర్సీపట్నం బయలుదేరిన వైఎస్ జగన్
- విశాఖ ఎయిర్‌పోర్టు వద్దకు భారీగా తరలి వచ్చిన అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు,
- అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదులుతున్నారు.

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
- వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు.
- కాసేపట్లో రోడ్డు మార్గంలో ఆయన నర్సీపట్నం వెళ్లనున్నారు.

అనకాపల్లిలో పోలీసుల భారీ బందోబస్తు..
- అనకాపల్లి నియోజకవర్గంలో భారీగా పోలీసులు మోహరించారు.
- గ్రామస్తులను వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు.
- గ్రామస్తులను అడ్డుకుంటున్న పోలీసులు.
#SadistChandraBabu
అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం
కసింకోట మండలం నర్సింగపల్లి గ్రామంలో జగన్ గారి పర్యటనకి వెళ్ళనీయకుండా బారీకేట్లు పెట్టి గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు...#ChaloNarsipatnam pic.twitter.com/49Nr8kvb3t— YSR Congress Party (@YSRCParty) October 9, 2025
ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరిన వైఎస్ జగన్
- ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరిన వైఎస్ జగన్
- విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
- రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్లనున్న జగన్.
- నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించినున్న వైఎస్ జగన్
- కేజీహెచ్‌లో గిరిజన విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
పోలీసుల ఆంక్షలు.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు..
- వైఎస్ జగన్ వస్తుండటంతో పోలీసుల ఓవరాక్షన్
- ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు.
- అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో బారికేడ్లు ఏర్పాటు.
- యలమంచిలి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో బారికేడ్లు దర్శనం.
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలను అడ్డుకుంటున్న పోలీసులు.
🚨 #SadistChandraBabu
గరికిబంధ చెక్ పోస్ట్ లో ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు గారితో పాటు వైఎస్ఆర్సిపి నాయకులను అడ్డుకున్న పోలీసులు..#ChaloNarsipatnam pic.twitter.com/NAkJUD39LB— YSR Congress Party (@YSRCParty) October 9, 2025
వైఎస్ జగన్ పర్యటన.. పోలీసుల ఆంక్షలు
- వైఎస్ జగన్ వస్తుండటంతో అనకాపల్లిలో పోలీసుల ఓవరాక్షన్
- అనకాపల్లి మండలం మార్టూరు జంక్షన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు.
- వాహనాల్ని ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు
- వాహనాల్లోని ప్రయాణికుల్ని మీరు ఎవరు?
- జగన్ గారిని చూడటానికి వెళ్తున్నారా? అంటూ ప్రశ్నలతో వేధింపులు
- వైఎస్ జగన్ గారి పర్యటన అంటే నీకు ఎందుకు ఇంత భయం చంద్రబాబు.
🚨 #SadistChandraBabu
వైయస్ జగన్ గారు వస్తుండటంతో అనకాపల్లిలో పోలీసులు అతి
అనకాపల్లి మండలం మార్టూరు జంక్షన్ వద్ద బారికేడ్లు పెట్టి.. వాహనాల్ని ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు
వాహనాల్లోని ప్రయాణికుల్ని మీరు ఎవరు? వైయస్ జగన్ గారిని చూడటానికి వెళ్తున్నారా? అంటూ ప్రశ్నలతో… pic.twitter.com/qGQJZxekZ5— YSR Congress Party (@YSRCParty) October 9, 2025
వైఎస్ జగన్ పర్యటన ఇలా..
- విశాఖ..
- నేడు వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన ఇలా..
- విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్ఏడీ గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా మెడికల్ కాలేజీ వరకు పర్యటన.
- వైఎస్ జగన్‌ను కలవనున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవా షుగర్ ఫ్యాక్టరీ రైతులు.
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్
గత ప్రభుత్వంలో చేపట్టిన 10 ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్న చంద్రబాబు
66 ఏళ్ల పాటు ప్రైవేట్‌కు కట్టబెడుతున్న దుస్థితి
ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల పూర్తికి 15.. 23 ఏళ్లు పడుతుందని దు్రష్పచారం
17 కళాశాలల నిర్మాణానికి గత ప్రభుత్వంలోనే రూ.8,480 కోట్ల నిధుల సమీకరణ
2023–24లో ఐదు.. 2024–25లో ఐదు.. 2025–26లో ఏడు ప్రారంభించేలా రోడ్ మ్యాప్
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ మేరకు వేగంగా అడుగులు
2023–24లో ఐదు కళాశాలలు ప్రారంభించి 750 సీట్లు సమకూర్చిన వైనం
2024లో గద్దెనెక్కిన వెంటనే కళాశాలల నిర్మాణాలు ఆపేసిన బాబు


