మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాల దాడి | TDP goons attack former MLA Kangati Sreedevi convey | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాల దాడి

Oct 17 2025 7:04 PM | Updated on Oct 17 2025 7:39 PM

TDP goons attack former MLA Kangati Sreedevi convey

సాక్షి,కర్నూల్‌: కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాలు దాడి చేశాయి. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు వెళ్తుండగా టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. 

టీడీపీ గూండాల దాడిలో వైఎస్సార్‌సీపీ ఎంపీపీ వాహనం ధ్వంసమైంది. వైఎస్సార్‌సీపీ నేతలు గ్రామంలోకి అడుగు పెట్టకూడదు అంటూ హుకుం జారీ చేశారు. గ్రామంలో రెచ్చిపోతూ స్థానికుల్ని టీడీపీ గూండాలు  భయబ్రాంతులకు గురి చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement