
సాక్షి,కర్నూలు: వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌కు నిరసన సెగ తగిలింది. ఉల్లికి గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు నిలదీశారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఖర్చులకు కూడా రావడం లేదని రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉల్లికి కనీసం రూ.2వేలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం ఖర్చులకు కూడా గిట్టుబాటు కాదని వాపోయారు. అంతా అయిపోయిన తరువాత ధర పెంచితే ప్రయోజనం ఏముంటుందని రైతులు ప్రశ్నించారు. అయితే, టీజీ భరత్ మాత్రం రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా తిరిగి వెళ్లిపోయారు.