
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(Medical Colleges Privatization) ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ(YSRCP) సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలను ప్లాన్ చేసింది.
ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుకు వైఎస్సార్‌సీపీ ముందు సాగనుంది. రచ్చబండ(Rachabanda), కోటి సంతకాల సేకరణ, గవర్నర్‌ని కలవటం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అక్టోబర్ పదో తేదీ నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో 28న నిరసన ర్యాలీలు చేపట్టనుంది. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది. ప్రతీ నియోజకవర్గం నుండి 50వేల సంతకాలు సేకరణ చేయనున్నారు. చివరగా నవంబర్ 26న పార్టీ నేతలు గవర్నర్‌ని కలిసేలా నిర్ణయం తీసుకున్నారు.