మెడికల్‌ కాలేజీలను అమ్మేస్తుంటే ప్రశ్నించకూడదా?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీలను అమ్మేస్తుంటే ప్రశ్నించకూడదా?: వైఎస్‌ జగన్‌

Sep 19 2025 8:41 PM | Updated on Sep 19 2025 8:50 PM

Ys Jagan Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? అంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయటంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా? అంటూ ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

‘‘చంద్రబాబూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైఎస్సార్‌సీపీ యూత్‌, స్టూడెంట్‌ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారు? లాఠీచార్జ్‌లు ఎందుకు చేశారు? గృహనిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

‘‘మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంటు మెడికల్‌ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణచివేస్తారా? మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటు అసెంబ్లీ వెలుపలకూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతుంటే పోలీసులచేత దౌర్జన్యం చేయించడం మీ బరితెగింపు కాదా? ఇది కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం.

..మీరింతగా తెగబడినా ప్రజాప్రయోజనాల పరిరక్షణ కోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితో పాటు యువతీయువకులు, స్టూడెంట్లు తెగింపు చూపారు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలోనూ, ఇటు మెడికల్‌ కాలేజీల ఆవరణలోనూ విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయి’’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement