వైఎస్సార్‌సీపీ ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు | YSRCP protest against Privatization of Medical Colleges Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

వైఎస్సార్‌సీపీ ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు

పోలీసుల అదుపులో సీదిరి అప్పలరాజు

  • శ్రీకాకుళం
  • పలాసలో వైఎస్సార్‌సీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీ
  • మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పోలీస్ స్టేషన్‌కు తరలింపు
  • పోలీసులతో  వైఎస్సార్‌సీపీ నేతల వాగ్వాదం
2025-11-12 12:32:38

తుపాన్‌ను పక్కకు పంపారు.. కాలేజీని నిర్మించాలేరా?: కిట్టు

  • మచిలీపట్నం
  • మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ పేర్ని కిట్టు కామెంట్స్‌..
  • యూరియా ప్రైవేటుకి అమ్మితేనే అడ్డుకోలేకపోయారు
  • ప్రైవేటుకి మెడికల్ కాలేజీలు ఇస్తే దోపిడీని అడ్డుకోగలరా?
  • తుపాన్‌ను పక్కకు పంపిన చంద్రబాబు మెడికల్ కాలేజీని నిర్మించాలేరా?
  • మహిళల వరల్డ్ కప్ గెలుపునకు సహకరించామని ప్రచారం చేసుకుంటున్న లోకేష్ మెడికల్ కాలేజీని కాపడలేరా?
  • ఆరోగ్యశ్రీ కార్డు పని చేయదని చెప్పినప్పుడు ప్రజలకు చంద్రబాబు చేసిన ద్రోహం తెలుస్తుంది.
  • ప్రతీ కుటుంబంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రజలు ఆలోచించాలి.
  • మచిలీపట్నం మెడికల్ కాలేజీని విమర్శిస్తున్న కళ్ళు లేని కాబోదులు నా దగ్గరకి వస్తే  చూపిస్తా..
  • మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాటం తప్పదు.
  • వైఎస్సార్‌సీపీ ప్రజల తరపున పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. 
2025-11-12 11:58:14

ప్రభుత్వం మెడలు వంచి ప్రైవేటీకరణను ఆపుతాం: చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి

  • తిరుపతి..
  • తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
  • చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కామెంట్స్‌..
  • మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజా ఉద్యమం తప్పదు
  • చంద్రబాబు కుటిల రాజకీయానికి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిదర్శనం
  • ప్రభుత్వం మెడలు వంచి ప్రైవేటీకరణను ఆపుతాం
  • మాజీ సీఎం జగన్ కష్టపడి కళాశాలలు కట్టిస్తే వాటిని ప్రైవేటీకరణ చేయడం దారుణం
  • వైఎస్‌ ఆధ్వర్యంలో ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం అవుతాం
2025-11-12 11:52:54

పేదల పొట్ట కొడుతున్నారు: పెద్దిరెడ్డి

  • చిత్తూరు..
  • మాజీ మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్.
  • 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
  • రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఈ మెడికల్ కాలేజీ వల్ల ఆదాయం కోట్లలో పెరుగుతుంది
  • పీపీపీ మోడ్‌లో లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు చూస్తున్నారు
  • పేద విద్యార్థులందరూ డాక్టర్లు అయ్యే అవకాశం ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల వల్ల మేలు జరుగుతుంది
  • 2150 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి
  • పులివెందుల మెడికల్ కాలేజీకి 50 మెడికల్ సీట్లు మంజూరు అయితే వద్దని చంద్రబాబు లేఖ రాశారు
  • పేదల పొట్ట కొడుతున్నారు. ప్రజలకు మేలు చేయాలని ఏ కోసాన లేదు
  • 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే 4500 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి
  • క్యూబా దేశంలో ఫిడెల్ కాస్ట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సీట్లు అందించి ఎందరో డాక్టర్లను తయారు చేశారు
  • 60 రాష్ట్రాల్లో డాక్టర్లు ఘన దేశంలో కరోనాలో కూడా ఆరోజు సేవలు అందించారు
  • వైఎస్‌ జగన్‌ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలి
2025-11-12 11:33:35

గుంటూరులో ఉద్రిక్తత..

  • గుంటూరు..
  • మాజీమంత్రి అంబటి రాంబాబు నివాసం నుంచి భారీ బైక్ ర్యాలీ
  • స్వామి థియేటర్ వద్ద ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య వాగ్వివాదం
  • పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఓవరాక్షన్
  • మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ దౌర్జన్యానికి దిగిన సీఐ గంగా వెంకటేశ్వర్లు
  • రాంబాబును దుర్భాషలాడిన సీఐ వెంకటేశ్వర్లు
  • పోలీసుల వైఖరి నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన
  • గతంలోనూ అంబటి రాంబాబు పట్ల దురుసుగా ప్రవర్తించిన పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు
2025-11-12 11:33:35

వినతిపత్రం అందజేత..

  • కాకినాడ జిల్లా.
  • మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పిఠాపురంలో వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీ
  • నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వంగా గీత
  • ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత
2025-11-12 11:25:04

పులివెందులలో భారీ ర్యాలీ...

  • వైఎస్సార్‌ జిల్లా..
  • పులివెందులలో ప్రజా వ్యతిరేక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి.
  • పాత ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద నుండి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు ర్యాలీ
  • మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా ఆపాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేయనున్న అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి.
  • ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ర్యాలీలు
  • ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు
  • కడప జిల్లా కేంద్రంలో ర్యాలీలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ పరిశీలకుడు సురేష్‌ బాబు
  • పులివెందులలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు
  • కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ
  • రాజంపేటలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ
  • బద్వేల్‌లో ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ
  • ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన
  • జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కదం తొక్కి పార్టీ శ్రేణులు.


  •  
2025-11-12 11:25:04

చంద్రబాబు.. పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకో: వరుదు కళ్యాణి

  • విశాఖ..
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తూర్పు నియోజకవర్గంలో నిరసన ర్యాలీ..
  • ర్యాలీకి హాజరైన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకట్ కుమారి..
  • వరుదు కళ్యాణి కామెంట్స్..
  • మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గం..
  • మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు పోరాడుతాం..
  • మెడికల్ కాలేజీల నిర్మాణంలో చంద్రబాబు విజన్ ఏమైంది?.
  • రెండు లక్షల కోట్లకు పైగా అప్పు చేసిన ప్రభుత్వం.. మెడికల్ కాలేజీలకు ఎందుకు ఖర్చు చేయలేక పోతుంది.?
  • పక్క రాష్ట్రాల ప్రభుత్వాలను చూసి చంద్రబాబు ఇప్పటికైనా నేర్చుకోవాలి. 
2025-11-12 11:07:28

వినతి పత్రం అందజేత

  • చిత్తూరు జిల్లా..
  • పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో  ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ
  • పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
  • పుంగనూరు తాహసీల్దారుకు వినతి పత్రాన్ని అందించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2025-11-12 11:07:28

కోటి గళాలై గర్జిస్తున్న జనం

  • తాడేపల్లి..
  • ఏపీలో ప్రారంభమైన ప్రజా ఉద్యమం
  • కోటి గళాలై గర్జిస్తున్న జనం
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆగ్రహం
  • 175 నియోజకవర్గాలలోనూ భారీగా నిరసన ర్యాలీలు
  • లక్ష కోట్ల సంపదను తన బినామీలకు కట్టబెడుతున్న చంద్రబాబుపై ఆగ్రహం
  • ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఉద్యమం
  • పోలీసుల ఆంక్షలను అధిగమించి ర్యాలీల్లో పాల్గొంటున్న విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు
2025-11-12 11:07:28

పేర్ని నాని ఆందోళన..

  • మచిలీపట్నం.. 
  • వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు పార్టీ శ్రేణుల ర్యాలీ
  • మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కిట్టు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • మచిలీపట్నం ఎమ్మార్వో కార్యాలయం వద్ద నేల మీద కూర్చొని ఆందోళన చేస్తున్న పేర్ని నాని, పేర్ని కిట్టు
2025-11-12 10:55:58

విశాఖలో భారీ ర్యాలీ..

  • విశాఖ..
  • మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు ప్రారంభం.
  • కేకే రాజు ఆధ్వర్యంలో నార్త్ నియోజకవర్గంలో ర్యాలీ.
  • గురుద్వారా నుంచి సీతమ్మధార ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ.
  • ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు.
  •  
2025-11-12 10:54:13

అడుగడుగునా ఆంక్షలు

విజయవాడ..

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్  నేతలు, కార్యకర్తలు

రామలింగేశ్వర నగర్ పడవలరేవు సెంటర్ నుండి దర్శిపేట రింగ్-పడమట ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ

వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలకు అడుగడుగునా ఆంక్షలు

నిరసన కార్యక్రమానికి భారీగా హాజరైన వైఎస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలు

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రోప్ పార్టీలతో అడ్డుకుంటున్న పోలీసులు

పోలీసుల తీరుపై దేవినేని అవినాష్ ఫైర్    

2025-11-12 10:54:13

ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు..

  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ
  • విజయనగరం జిల్లా..
  • చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం గరివిడి నుండి చీపురుపల్లి తాసిల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ
  • వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.
  • శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
  • మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద మూడు అంచెల చెక్ పోస్టులు ఏర్పాటు.
  • వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడికి చేరుకోకుండా అడ్డుకుంటున్న పోలీసులు. 
2025-11-12 10:35:11

కొవ్వూరులో భారీ ర్యాలీ..

  • నెల్లూరు..
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ
  • నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలలో ప్రజా ఉద్యమ బాట..
  • నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులతో ర్యాలీ
  • కోవూరులో మాజీ మంత్రి కాకాణి, ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
  • రైల్వే ఫిడర్స్ రోడ్డు నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ.
2025-11-12 10:23:55

తిరుపతిలో భారీ నిరసన ర్యాలీలు

  • తిరుపతి..
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు
  • తిరుపతి, కొర్లగుంటులో భారీగా ర్యాలీ చేపట్టిన వైఎస్సార్‌సీపీ.
  • తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ రెడ్డి ఆద్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ
  • లాదిగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలతో కలిసి నిరసన చేపట్టిన వైఎస్సార్‌సీపీ.
  • ర్యాలీలో పాల్గొన్న భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష యాదవ్, వైఎస్సార్‌సీపీ నాయకులు. 
2025-11-12 10:21:24

అంజద్ భాషకు పోలీసుల నోటీసులు..

  • వైఎస్సార్‌ జిల్లా..
  • ప్రజా పోరు నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషకు పోలీసుల నోటీసులు..
  • నిన్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు..
  • ప్రజా పోరుకు అనుమతి ఉందంటూ నాయకులకు స్పష్టం చేసిన ఎస్పీ..
  • ఈరోజు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన అంజద్ భాష
2025-11-12 10:21:24

వైఎ‍స్సార్‌సీపీ నాయకుల హౌస్‌ అరెస్ట్‌..

  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా..
  • వైఎ‍స్సార్‌సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి పోలీసుల ఆంక్షలు
  • పి గన్నవరం నియోజకవర్గంలో కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్‌తో సహా పలువురు నాయకులు హౌస్ అరెస్ట్
  • నిరసన ర్యాలీకి వైఎ‍స్సార్‌సీపీ నేతలు హాజరు కాకుండా ఉండేందుకు పోలీసుల ప్రయత్నాలు
2025-11-12 09:34:11

అనకాపల్లిలో పోలీసుల ఆంక్షలు..

  • అనకాపల్లి..
  • వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలపై  మొదలైన పోలీసుల ఆంక్షలు..
  • నర్సీపట్నంలో నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు.
  • మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.
  • అనుమతి ఇవ్వకపోయిన ర్యాలీ జరుగుతుందన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ వ్యాఖ్యలు 
2025-11-12 08:11:19

వైఎస్‌ జగన్‌ ఉద్యమ కార్యాచరణ

  • ఏపీలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ. 
  • చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్‌ జగన్‌ ఉద్యమ కార్యాచరణ ప్రకటన
  • నేడు 175 నియోజకవర్గాల్లో కదం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు
  • అక్టోబర్‌ 10 నుంచి ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్‌ నిర్వాకాన్ని ప్రజలకు వివరిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పోటాపోటీగా అన్ని వర్గాల ప్రజల సంతకాలు
  • కోటి సంతకాల సేకరణకు వస్తున్న ప్రజాస్పందన చూసి బాబు సర్కారులో వణుకు
  • నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులను ఉసిగొల్పిన ప్రభుత్వ పెద్దలు
  • ర్యాలీల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులిస్తూ బెదిరింపులు
  • పోలీసుల నోటీసులు, బెదిరింపులను లెక్క చేయకుండా ఉద్యమించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యార్థులు సిద్ధం
  • అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చి.. ఆసరా ఎగ్గొట్టిన బాబు ప్రభుత్వం  
  • పెండింగ్‌లో దాదాపు రూ.4 వేల కోట్ల బకాయిలు.. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సేవలందక రోగుల అవస్థలు
  • కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం..  
  • మన విద్యార్థులకు మెడికల్‌ సీట్లు ఉచితంగా, తక్కువ ఫీజుకే అందుబాటులోకి..  
  • కుట్రపూరితంగా అడ్డుకుని ప్రైవేట్‌కు అప్పగిస్తున్న బాబు సర్కారు  
2025-11-12 08:11:19

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. నేడు వైఎస్సార్‌సీపీ ర్యాలీలు

  • నేడు వైఎస్సార్‌సీపీ ర్యాలీలు
  • ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ర్యాలీలు
  • అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ నిర్వహించాలని నిర్ణయం
  • ఇప్పటికే పెద్ద ఎత్తున సాగుతున్న కోటి సంతకాల సేకరణ
  • చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, పలు రాజకీయ పార్టీలు
  • రూ.2.5 లక్షల కోట్లు అప్పులు చేస్తూ.. కేవలం రూ.5 వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇవ్వలేరా అంటూ నిలదీస్తున్న జనం
2025-11-12 08:11:19
Advertisement
 
Advertisement
Advertisement