ఫైల్‌పోటో
పాడేరు(అల్లూరి జిల్లా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐఎస్‌ఎఫ్ నిరసన చేపట్టింది. విద్యావ్యవస్థను నీరుగారుస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలను తప్పుబట్టింది. ఈ మేరకు పాడేరు మెడికల్ కళాశాలను విద్యార్థి సంఘాల బృందం సందర్శించింది. విద్యార్థుల సంస్థల్లో నెలకొన్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టింది ఏఐఎస్‌ఎఫ్.
సీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రేవేటుపరం చేస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుదాం! ఉద్యమాలను తీవ్రతం చేద్దాం!.... అంటూ పిలుపునిచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన తప్పుడు జీవో నెంబర్77ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల హక్కులను హరించే ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.


