వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం
ప్రభుత్వ సంపదను ప్రైవేటుకు అప్పగించడం హేయం
సొంత ఆర్థిక ప్రయోజనాల కోసమే ప్రైవేట్‌పరం చేస్తున్నారు
యువగళంలో మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వమే నడుపుతుందని లోకేశ్ ఇచి్చన హామీ ఏమైంది?
మెడికల్ కాలేజీలపై కూటమి కుట్రపై ‘పీపుల్స్ ఫర్ ఇండియా’ ధ్వజం
సాక్షి, విశాఖపట్నం: విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టేసి.. ప్రజలకు ప్రధాన అవసరాల్ని దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో కుట్ర పన్నుతోందని ‘పీపుల్స్ ఫర్ ఇండియా’ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పేరుతో కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రజారోగ్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ప్రజారోగ్య వేదిక, పీపుల్ ఫర్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విలువైన ప్రజాధనాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే చంద్రబాబు వైఖరిపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు.
ఐదేళ్ల తర్వాత పదవిలో ఉంటామన్న గ్యారెంటీ లేదు
ఐదేళ్ల తర్వాత గెలుస్తామో లేదో అన్న గ్యారెంటీ అధికారంలో ఉన్న వాళ్లకి లేదు. ఐదేళ్లలోనే 50 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించాల్సిందంతా సంపాదించేయాలన్న తొందరతోనే రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బలవుతున్నారు. కాబట్టి.. ప్రజలే ముందుకు రావాలి. నిరసనల్ని ఉద్యమంగా మార్చి.. ప్రజావ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. – ఎంవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీ
ప్రజాధనాన్ని ప్రైవేట్‌కివ్వడమే సంపద సృష్టా?
సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్‌పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి.
– కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీ
ప్రజాధనాన్ని ప్రైవేట్‌కివ్వడమే సంపద సృష్టా?
సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్‌పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీ
ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది
కేజీహెచ్‌కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక
అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు
పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్‌ఎఫ్‌ఐ
కార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..!
వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్‌కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్‌కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్‌వో