breaking news
PPP
-
పీపీపీ కమిషన్లలో బాబు, పవన్, లోకేష్‌కు వాటాలు: జడ శ్రావణ్ కుమార్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో శనివారం మేధోమథనం సదస్సు జరిగింది.జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదు. ఈ విధానం వల్ల బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుంది. తీవ్ర వ్యతిరేకత వస్తున్న చంద్రబాబు వెనక్కి తగ్గకపోవడం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతోంది. పీపీపీ చేయడం వల్ల వచ్చే కమిషన్లలో చంద్రబాబు,పవన్,లోకేష్‌కు వాటాలు పంచుకోవాలనుకుంటున్నారు... ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక్క ఏడాది అడ్మిషన్లలోనే రూ.400 కోట్లు సంపాదిస్తారు. చంద్రబాబుకు నాదొక సూటి ప్రశ్న..ధైర్యముంటే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగే విధానంలోనే పీపీపీలోనూ చేపడతారని చెప్పగలరా?. ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయి. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరు. కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి అని అన్నారాయన. ఈ క్రమంలో.. సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత పై జడ శ్రవణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘అన్నీ నేనే కనిపెట్టానని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు వల్ల ఏడాదికి 2500 మంది పేద విద్యార్ధులకు విద్య అందకుండా చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత తన పని తాను చేయడం లేదు. శాంతిభద్రతలను గాలికొదిలేసి మెడికల్ కాలేజీల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వంగలపూడి అనితకు నాదొక ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అడ్మిషన్ పద్ధతిలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లు జరుగుతాయా?. పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు?’’ అని ప్రశ్నించారాయన. అమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ.. పీపీపీ అంటే చంద్రబాబుకు తెలుసా?. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజలకు ఇచ్చే అసలైన సంక్షేమం. కోవిడ్ నేర్పిన పాఠాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. పేదలకు మెరుగైన వైద్యం,వైద్య విద్యను అందజేస్తేనే సమాజం బాగుపడుతుంది. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారా?.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా...ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా? అని నిలదీశారు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని.. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదీ చదవండి: టీడీపీలో వాళ్లు పనోళ్లేనా? -
వైద్యకళాశాలల ప్రైవేటీకరణ ఎవరికి లాభం?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈ చర్యలో అసలు హేతుబద్ధత అన్నదే లేదని, టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారు ప్రైవేటీకరణ పేరుతో వైద్యకళాశాలలను తమ తాబేదార్లకు అప్పగిస్తోందన్న విమర్శలు అటు సామాన్య ప్రజానీకంతోపాటు ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణలు వినిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని బీరాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆస్తులు అమ్ముతూ ప్రైవేటువారికి సంపద సృష్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో యాభై శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిని పెడతామన్న వైఎస్ జగన్ మాటలను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన బాబు, లోకేశ్‌లు ఇప్పుడు మాటమార్చడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా పీపీపీ విధానం ప్రైవేటేషన్ కాదని, జగన్‌కు ఆ విషయం తెలియదని బాబు అండ్ కో బుకాయిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌లు అసెంబ్లీలోని ఇరు సభల్లో చేసిన వాదనలను పరిశీలిస్తే వీరు వైద్యకళాశాలల ప్రైవేటీకరించి కళ్లప్పగించి చూడబోతున్న వైనం స్పష్టమవుతోంది. పేదలకు వైద్యవిద్య అన్నది ఒట్టిమాటేనని, వ్యహారమంతా ధనికులకు అనకూలంగానే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. పీపీపీ అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానమంటున్న చంద్రబాబు తద్వారా కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణలో తమ అసమర్థతను బయటపెట్టుకున్నట్లు అయ్యింది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద ఆస్పత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే, సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం కంటే ప్రైవేటు వారే బెటర్ అంటున్నారా? ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకో? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణాల మాదిరి అయితే ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనను తాను అసమర్థుడిగా చెప్పుకుంటున్నట్లే కదా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో లక్ష కోట్లైనా ఖర్చు చేసి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామనడం మరీ విడ్డూరంగా ఉంది. జగన్ సీఎంగా రెండేళ్లలోనే ఐదు వైద్య కశాళాలలను అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత ఇంకో రెండు దాదాపుగా పూరర్తయ్యాయి. మిగిలిన పదింటికీ అయ్యే రూ.ఐదారు వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోలేదా? లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చు కోలేకపోతే ప్రైవేటు సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి? ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేని విధంగా ఒక్కో వైద్యకళాశాలలకు కేటాయించిన దాదాపు యాభై ఎకరాల భూమిని ఎకరా రూ.వంద చొప్పున లీజుకు ఇవ్వడమంటే ఉత్తినే ఇచ్చినట్లు కదా? ప్రైవేట్ సంస్థలు ఈ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే.. ప్రభుత్వం తన సంపదను రాసిచ్చినట్లే అవుతుంది.ప్రస్తుతం 33 ఏళ్లు ఉన్న లీజు భవిష్యత్తులో పొడిగించరన్న గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి.. ఇవి శాశ్వతంగా ప్రైవేటు వారి పరమవుతాయి. పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు అమరావతి మాదిరే ప్రభుత్వం రుణాలు తేలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ చంద్రబాబు ప్రభుత్వం 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసింది. కొనుగోలు చేసిన సంస్థలు తమకు దక్కిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. ఎవరి సంపద ఎవరి పరమైనట్లు? జగన్ ప్రభుత్వం ఏభై శాతం సీట్లు సెల్ప్ ఫైనాన్స్ పద్దతిలో కేటాయించి, వాటికి రూ.20 లక్షల చొప్పున ఫీజ్ వసూలు చేయాలని నిర్ణయిస్తే, చంద్రబాబు, లోకేశ్‌లు తప్పు పట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి అంతా ఫ్రీ చేస్తామని లోకేశ్ విద్యార్ధుల సమావేశంలోనే ప్రకటించారు. ఇప్పుడు మొత్తం ప్రైవేటుపరం చేయడమే కాకుండా, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదు రూ.57 లక్షలు ప్రభుత్వ రంగంలో రూ.20 లక్షలు అంటే అంతే మొత్తం వసూలు చేస్తారు. అదే ప్రైవేటు వారు అయితే ఈ రూ.57 లక్షలే కాకుండా, అదనంగా రూ.కోటి పైనే వసూలు చేయవచ్చు అంటున్నారు. మొత్తం డబ్బు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చేలా జగన్ చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు దక్కేలా చేస్తున్నారన్న విమర్శకు సమాధానం దొరకదు. ఇంతా చేసి ఆ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో ప్రజలందరికి ఉచిత వైద్య సేవలు అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు. ప్రైవేటు సంస్థలు లాభాలు రాకపోతే మనలేవన్నది తెలిసిన సత్యమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష రూపాయల విలువైన చికిత్స అయినా, ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తారు. మరి పీపీపీ మోడల్లో ఏర్పాటైన ప్రైవేట్ కళాశాలలు ఇలా చేస్తాయా? చేయవు. ఒకవేళ చేసినా ఆ మొత్తాలను ఎన్టీఆర్ వైద్య సేవ లేదా బీమా సదుపాయం పేరుతో ప్రభుత్వం నుంచే వసూలు చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పీపీపీ విధానంతో ప్రజలకు ఒరిగేదేమిటి? ప్రభుత్వానికి మిగిలేదేమిటి? ప్రైవేటీకరణే విధానమని నిర్ణయించుకుని ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై రూ.700 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఇప్పటివరకూ ఆయా కళాశాలల ఏర్పాటుకు అయిన ఖర్చు (భూమి + నిర్మాణాలు) తీసుకుని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉంటే కనీసం ప్రభుత్వానికి కొంత డబ్బు మిగిలి ఉండేదేమో. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా ఏభై శాతం సీట్లు మెరిట్ ప్రకారం, రిజర్వేషన్లు పాటిస్తూ కేటాయించాల్సిందే. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటువారికి ఉత్తపుణ్యానికి ధారాదత్తం చేసి మెడికల్ కాలేజీలను నడపాలని చెప్పడం అర్ధరహితం. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి పొందిన సంస్థలు భూమిని స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. భవనాలు సొంత ఖర్చుతో నిర్మించుకుంటున్నాయి. యంత్ర పరికరాలు ఇతర సదుపాయాలన్నీ సొంత ఖర్చుతోనే చేసుకుంటున్నాయి. కాని ఇప్పుడు ప్రభుత్వం భూమి, భవనాలు ఉచితంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో అర్ధం ఏమి ఉంటుంది? పైగా ఈ కాలేజీలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను కూడా అప్పగిస్తారట. ఈ సంస్థలు ఉచితంగా సేవలు అందించనప్పుడు ,ప్రభుత్వం వారికి రకరకాల రూపాలలో ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ప్రస్తుతం నాలుగు కాలేజీలకు పీపీపీ విదానం అమలు చేస్తున్నా, భవిష్యత్తులో మిగిలిన కాలేజీలన్నిటిని అదే రకంగా అప్పచెప్పనున్నారు. బహుశా పూర్తి అయిన ఏడు కాలేజీలను కూడా అలాగే ఇచ్చేస్తే జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకు వచ్చిన ఆశయాన్ని పూర్తిగా నీరుకార్చిన ఘనత కూటమి సర్కార్ కు దక్కుతుంది. ఝార్కండ్ రాజధాని రాంచీలో ఒక ప్రభుత్వ ఆస్పత్రిని ఇదే విధంగా పీపీపీ అంటూ ప్రైవేటీకరించబోగా ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒడిశా లో గత బీజేడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయలేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ప్రభుత్వాలే కొత్త కాలేజీలను నడుపుతున్నాయి. ఇవన్ని ఎందుకు! ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తోంది కదా! ఎందుకు వారు ప్రభుత్వరంగంలోనే నెలకొల్పుతున్నారు? కొత్తగా కేంద్రం ఇస్తున్న పదివేల మెడికల్ సీట్లను ప్రభుత్వ కాలేజీలకే ఎందుకు ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వం రోడ్లు, పోర్టులు ప్రైవేటైజ్ చేయడం లేదా అని పిచ్చి వాదన చేస్తోంది. రోడ్లకు, ఓడరేవులకు వైద్యరంగానికి పోలిక పెట్టడం అంటే ప్రజారోగ్యంపైన, పేదల వైద్యంపై చులకన భావం ఉన్నట్లు అనిపించడం లేదా?ఏది ఏమైనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకు రాలేకపోయిన చంద్రబాబు నాయుడు, తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటైకీరణకు దిగుతుండడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే జగన్... బుద్ది జ్ఞానం ఉన్నవారెవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేటు వారికి అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రజల కోసం జగన్ సంపద సృష్టిస్తే,, ఆ సందపను చంద్రబాబు ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం సరైనదా? ఇదేనా చంద్రబాబు చెప్పే విజన్?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించకపోతే ఉద్యమం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఉద్యమం తప్పదని పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ సమితి హెచ్చరించింది. శనివారం పాలకొల్లులోని పూలపల్లి అంబేడ్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘పాలకొల్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ’ అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఇందులో భాగంగా 17 మెడికల్ కళాశాలలను జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం గత ప్రభుత్వం రూ.2,400 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంకా దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అరకొర పనులు చేపట్టిందని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ వాటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించామని కబుర్లు చెబుతూ ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పీపీపీ అంటూనే వైద్యకళాశాలలు ప్రైవేటుపరం కావని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. పీపీపీ పద్ధతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా ఓసీ కులాల్లోని పేద విద్యార్థులకూ నష్టం కలిగిస్తుందన్నారు.వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగాల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే విద్య, వైద్యం రెండూ ఖరీదయ్యాయని, మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఎం నేత జేఎన్వీ గోపాలన్, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, సంచార జాతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్ర వీరన్న, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు, జేవీవీ జిల్లా నాయకుడు యర్రా అజయ్‌కుమార్, దగ్గులూరు సర్పంచ్ పేరయ్య, పట్టణ జేఏసీ చైర్మన్ గుడాల హరిబాబు తదితరులు మాట్లాడారు. -
విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టే కుట్ర
సాక్షి, విశాఖపట్నం: విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టేసి.. ప్రజలకు ప్రధాన అవసరాల్ని దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో కుట్ర పన్నుతోందని ‘పీపుల్స్ ఫర్ ఇండియా’ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రజారోగ్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ప్రజారోగ్య వేదిక, పీపుల్ ఫర్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విలువైన ప్రజాధనాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే చంద్రబాబు వైఖరిపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు.ఐదేళ్ల తర్వాత పదవిలో ఉంటామన్న గ్యారెంటీ లేదు ఐదేళ్ల తర్వాత గెలుస్తామో లేదో అన్న గ్యారెంటీ అధికారంలో ఉన్న వాళ్లకి లేదు. ఐదేళ్లలోనే 50 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించాల్సిందంతా సంపాదించేయాలన్న తొందరతోనే రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బలవుతున్నారు. కాబట్టి.. ప్రజలే ముందుకు రావాలి. నిరసనల్ని ఉద్యమంగా మార్చి.. ప్రజావ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. – ఎంవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీప్రజాధనాన్ని ప్రైవేట్‌కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్‌పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రజాధనాన్ని ప్రైవేట్‌కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్‌పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్‌కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్‌కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్‌కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్‌వో ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్‌కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్‌కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్‌కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్‌వో -
మెడికల్ కాలేజీలపై చర్చించాల్సిందే.. మండలిలో వైఎస్సార్సీపీ పట్టు
సాక్షి,అమరావతి: ఏపీ శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాల్సిందేనని పట్టుబడుతున్నారు. కొద్ది సేపటి క్రితం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో వాయిదా పడిన శాసన మండలి తిరిగి ప్రారంభమైంది. అయితే, సభలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరపాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగింది. పీపీపీ విధానం రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. మండలి పోడియంను చుట్టుముట్టారు. ఈ నినాదాల మధ్య మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. అంతకుముందు ఏపీ శాసన మండలి వాయిదా పడింది. మండలి సమావేశాల నేపథ్యంలో శుక్రవారం సభలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఆందోళన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే సభలో చర్చించాలని ప్లకార్డ్‌లతో నినాదాలు చేశారు. అయితే, వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో శాసనమండలి ఛైర్మన్ ఏపీ శాసన మండలిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
నియంతకు పరాభవం
‘ప్రభుత్వం ప్రజలకు భయపడినంతకాలం స్వేచ్ఛ ఉంటుంది...ప్రజలు ప్రభుత్వానికి భయపడితే నియంతృత్వం తప్పదు’ అని ఒక రాజనీతిజ్ఞుడు అంటాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సెక్–యోల్ మంగళవారం హఠాత్తుగా దేశంలో విధించిన సైనికపాలన కాస్తా జనం తిరగబడేసరికి కేవలం ఆరు గంటల్లో తోకముడిచిన తీరు దాన్ని మరోసారి అందరికీ గుర్తుచేసింది. వచ్చే నెలనుంచి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిని చవిచూడబోతున్న అమెరికా ప్రజానీకం మొదలు దేశదేశాల పౌరులూ ఈ ప్రహసనం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ‘రాజ్య వ్యతిరేక శక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఏరిపారేసి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి’ ఎమర్జెన్సీ విధింపు, సైనిక పాలన తప్పనిసరయినట్టు రాత్రి పొద్దుపోయాక యూన్ ప్రకటించారు. పొరుగునున్న శత్రు దేశం ఉత్తరకొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో కుమ్మక్కయిన విపక్షాలు దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని ఆరోపించారు. కానీ రోడ్లపైకొచ్చిన సైనికులకు దేశమంతా ప్రతిఘటన ఎదురవుతున్నట్టు, నిరసనోద్యమాలు తారస్థాయికి చేరినట్టు అందిన సమాచారంతో బెంబేలెత్తిన ఆయన సైనికపాలనను ఎత్తేస్తున్నట్టు తెల్లారుజామున నాలుగుగంటలప్రాంతంలో తెలియజేయాల్సివచ్చింది. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించిన సైనికులను జనం తరిమికొట్టడంతో ఆయనకు తత్వం బోధపడింది. విపక్షం తీసుకురాబోతున్న అవిశ్వాస తీర్మానంతో తనకు పదవీభ్రష్టత్వం తప్పదనుకుని హడావిడిగా వేసిన సైనిక పాలన ఎత్తుగడ కాస్తా వికటించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా తలుపులు మూసేసింది. 2027 వరకూ ఉండాల్సిన అధ్యక్షపదవి మరికొన్ని రోజుల్లో ఊడటం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మితవాద పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) తరఫున 2022 ఎన్నికల్లో పోటీచేసేనాటికి యూన్ అనామకుడు. అప్పటికి హద్దులు దాటిన ద్రవ్యోల్బణం, ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడ్డ తీవ్ర అసంతృప్తి ఆసరాగా చేసుకుని ఆయన అధ్యక్షుడిగా విజయం సాధించాడు. అయితే ప్రత్యర్థి డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే–మ్యుంగ్ కన్నా ఆయనకు కేవలం ఒక శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. మ్యుంగ్ సఫాయి కార్మికుడి కుమారుడు.సంపన్నవంతమైన దక్షిణ కొరియాకు అసలు సమస్యలేమిటన్న సందేహం అందరికీ వస్తుంది. దాని తలసరి ఆదాయం 36,000 డాలర్లు. పొరుగునున్న చైనాతో పోల్చినా ఇది మూడు రెట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్లో మెరిసిపోయే బ్రాండ్లకు అది పుట్టినిల్లు. శామ్సంగ్, హ్యుందయ్, కియా, పోక్సో, ఎల్జీ, ఎస్కే... ఒకటేమిటి రకరకాల సంస్థల స్థావరం ఆ దేశం. వీటిలో 600 కంపెనీల వరకూ మన దేశంతోసహా చాలా దేశాల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. దక్షిణ కొరియా ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఎగుమతిదారు. ఆసియాలో అది నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. 2009నాటి ఆర్థికమాంద్యాన్ని దక్షిణకొరియా తన దరిదాపులకు రానీయలేదు. అయినా ఏదో తెలియని వెలితి ప్రజలను నిరాశానిస్పృహల్లో ముంచింది. వృద్ధుల శాతం క్రమేపీ పెరగటం, జననాల సంఖ్య పడిపోవటం సమస్యగా మారింది. అధిక పనిగంటల వల్ల మానసిక ఒత్తిళ్లు అధికం కావటం, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవటం, దంపతులు సైతం కలిసుండే గంటలు తగ్గిపోవటం వంటివి ఇందుకు కారణాలు. కానీ యూన్ దీన్ని మరో కోణంలో చూశారు. ఫెమినిస్టు ఉద్యమాలే ఈ స్థితికి కారణమంటున్న ఉద్యమాలను వెనకేసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా స్త్రీ ద్వేషాన్ని చాటుకున్నారు. అధికారం చేతికి రాగానే లింగ సమానత్వాన్ని పర్యవేక్షించే సంస్థను రద్దుచేశారు. మహిళలకుండే వెసులుబాట్లు కొన్ని రద్దుచేశారు. పైగా వారానికి 52 గంటల పనిని కాస్తా పెంచే ప్రయత్నం చేశారు. వైద్యరంగ ప్రక్షాళన పేరిట దాన్ని అస్తవ్యçస్తం చేశారు. పర్యవసానంగా దేశం సమ్మెలతో హోరెత్తింది. దీనికితోడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. కనుకనే మొన్న ఏప్రిల్‌లో 300 స్థానాలుగల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపినప్పుడు భారీ స్థాయిలో 67 శాతంమంది పోలింగ్‌లో పాల్గొన్నారు. విపక్షమైన డెమాక్రటిక్ పార్టీకి 180 స్థానాలు రాగా, అధికారపక్షం 108 స్థానాలకు పరిమితమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కూడా గత సైనిక పాలకుల్ని కీర్తించటం యూన్ ఒక అలవాటుగా చేసుకున్నారు. వారివల్లే దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని ఆయన నిశ్చితాభిప్రాయం. ఇందుకు భిన్నంగా ప్రజలంతా ఆనాటి నియంతృత్వాన్ని మరిచిపోలేకపోయారు. 1987కు ముందున్న సైనిక పాలన తెచ్చిన అగచాట్లు గుర్తుండబట్టే యూన్ ప్రకటన వెలువడిన వెంటనే జనం వరదలై పోటెత్తారు. ప్రజల మద్దతు గమనించినందు వల్లే అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంటుకు బారులు తీరారు. ప్రధానద్వారాన్ని సైనికులు మూసేయగా జనం సాయంతో స్పీకర్‌తో సహా అందరూ గోడలు దూకి, కిటికీలు బద్దలుకొట్టి భవనంలోకి ప్రవేశించారు. సైనిక పాలన వెనక్కు తీసుకోవాలంటూ అధ్యక్షుణ్ణి కోరే తీర్మానాన్ని హాజరైన 190మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. శత్రు దేశాలను చూపించి, కమ్యూనిస్టుల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే శకం ముగిసిందని దక్షిణ కొరియా ఉదంతం చెబుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలుండటం తప్పనిసరి. కానీ వాటిని సాకుగా చూపి అందరినీ మభ్యపెట్టి అధికారంలోకొచ్చాక నియంతృత్వ పోకడలకు పోతే చెల్లదని జనం చాటారు. యూన్ ఏలుబడి ఎప్పుడు ముగుస్తుందన్న సంగతి అలావుంచితే, ప్రజలు ఇదే చైతన్యాన్ని కొనసాగించగలిగితే భవిష్యత్తులో అక్కడ ఏ పాలకుడూ నియంతగా మారే ప్రమాదం ఉండదు. -
పీపీపీ విధానంలో ఐదు టెక్స్టైల్ పార్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఐదు టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈమేరకు ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ–2024–29కి ఆమోదం తెలిపింది. రెండు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిలో సూక్ష్మ యూనిట్లకు 30 శాతం, మధ్య తరహా యూనిట్లకు 20 శాతం, పెద్ద పరిశ్రమలకు 25 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు.సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయాలను మంత్రులు కె.పార్థసారథి, పి.నారాయణ మీడియా సమావేశంలో వివరించారు. పలు పాలసీలు, అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రులు వివరించారు. కాకినాడ పోర్టులో షిప్ సీజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించాల్సి ఉందని మంత్రి తెలిపారు. మంత్రిమండలి ఇతర నిర్ణయాలు.. ⇒ ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ–2024–29కి ఆమోదం. దీని కింద ఐటీ సంస్ధల కోసం మౌలిక వసతులు కలి్పంచే డెవలపర్లకు, కో వర్కింగ్ స్పేస్, నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధి చేసే వారికి పలు రాయితీలు ఇస్తారు. ఐటీ కాంప్లెక్స్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ సెంటర్లు అభివృద్ది చేసే వారికి 50 శాతం కేపిటల్ రాయితీ ఇస్తారు.కో వర్కింగ్ స్పేస్‌కు రాయితీకి కనీసం 100 సీట్ల సామర్ఢ్యం లేదా 10 వేల చదరపు అడుగుల కార్యాలయ సముదాయం ఉండాలి. నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌కు పది సీట్ల సామర్ధ్యం లేదా వెయ్యి చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఉండాలి. కో–వర్కింగ్‌లో సీటుకు నెలకు రూ.2 వేలు, నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌లో సీటుకు నెలకు రూ.1000 చొప్పున 6 నెలలు రాయితీ ఇస్తారు. 5 లక్షల చదరపు అడుగుల ఫ్లోర్ ఏరియా పైబడిన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేవారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ ఇస్తారు. ⇒ పీఎంఏవై కింద నిర్మాణం ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోని 6.41 లక్షల ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1.90 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని 2026 మార్చికల్లా పూర్తి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరించిన మూడు ఆప్షన్ల విధానంలో, అదే యూనిట్ విలువకు వీటిని నిర్మిస్తారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని నిర్ణయించింది. ⇒ పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంతో ఏపీ మారిటైమ్ పాలసీ–2024–29కి ఆమోదం. మెగా పోర్టు మంజూరుకు ప్రయతి్నంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. ⇒ టూరిజంకు పారిశ్రామిక హోదా కలి్పస్తూ నూతన విధానానికి ఆమోదం. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో టెంపుల్, ఎకో టూరిజం, వెల్నెస్, అగ్రీ సర్క్యూట్ ప్రాజెక్టులు చేపడతారు. ⇒ పౌర సేవల సులభతరం, వాట్సాప్ ద్వారా అన్ని సరి్టఫికెట్లు అందించడం లక్ష్యంగా ఆర్టిజీఎస్ పాలసీ–2024–29కు ఆమోదం.⇒ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ మొబిలిటీ పాలసీ–2024–29కి ఆమోదం. రాజధానిని ఎలక్ట్రికల్ మొబిలిటీ సిటీగా తీర్చిదిద్దేలా పాలసీ. దీని ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడి, 60 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. విద్యుత్ వాహనాలు కొనే వారికి రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ. ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం, పులివెందుల, డోన్ తాగునీటి ప్రాజెక్టుల ధరల జీవో 62 ద్వారా సవరణకు ఆమోదం. ⇒ ఆయుర్వేద, హోమియోపతిక్ బోర్డుల పేర్లను మార్చడం, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 కి అనుగుణంగా బోర్డు పునరి్నర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ⇒ డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. ఆయన జన్మస్థలంలో నివాసం ఉన్న ఇంటిని మ్యూజియంగా తీర్చిదిద్దాలని, ఆయనపై లఘు చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయం. ⇒ రాజధానిలో గతంలో చేపట్టి, పూర్తికాకుండా ఉన్న రూ.7,391.65 కోట్ల విలువైన పనుల్లో 18 పనులను తిరిగి చేపట్టేందుకు రూ.11,471 కోట్లకు ఈ నెలలో టెండర్లను ఆహా్వనించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెలలో టెండర్లు పూర్తిచేసి, మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ధరలు, జీఎస్టీ, డ్యామేజీ కారణంగా ఈ పనుల వ్యయం 30 శాతం పెరిగినట్లు మంత్రులు తెలిపారు. -
‘ఇమ్రాన్‌కు పోటీగా విపక్షాల అభ్యర్థి’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 11న పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండగా ఆయనకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీలైనా నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ, బెనర్జీర్ భుట్టో కుమారుడి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు ఏకతాటిపైకి వచ్చాయి. ఇతర చిన్న పార్టీలను కలుపుకొని విపక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. గురువారం రెండు పార్టీల నేతలు మాట్లాడుతూ.. పార్లమెంటులో ఇమ్రాన్‌కు పోటీగా విపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలుపడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పాటు జరిగిందని పీఎంఎల్-ఎన్ పార్టీ నేత మర్యమ్ ఔరంగజేబు తెలిపారు. ఎన్నికలు జరిగనప్పటి నుంచి పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీలు ఇమ్రాన్ రిగ్గింగ్‌కు పాల్పడినట్టు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జూలై 25న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ 116 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం కొన్ని చిన్న పార్టీలు, పలువురు ఇండిపెండెట్ల మద్దతుతో ఇమ్రాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడ్డారు.విపక్షాలు ఎంతగా ప్రయత్నించిన ఇమ్రాన్ ప్రధాని కాకుండా అడ్డుకోవడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇన్ఫ్రాకు పెద్దపీట..
- అదనంగా రూ. 70,000 కోట్ల కేటాయింపులు - ఎన్ఐఐఎఫ్ ఏర్పాటు ‘పీపీపీ’ ప్రాజెక్టులకు ఊతం న్యూఢిల్లీ: వృద్ధి ఆశలతో పొంతన లేకుండా ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టి పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2015-16లో అదనంగా రూ. 70,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందున్న అయిదు ప్రధాన సవాళ్లలో.. ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కూడా ఒకటని ఆయన చెప్పారు. ఈ రంగ వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన ప్రాజెక్టులకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. రహదారుల నిర్మాణానికి రూ. 14,031 కోట్ల మేర, రైల్వేలకు రూ. 10,050 కోట్ల మేర స్థూలంగా బడ్జెట్లో కేటాయింపులు పెంచినట్లు జైట్లీ చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు రూ. 3,17,889 కోట్ల స్థాయిలో ఉంటాయని... 2014-15తో పోలిస్తే ఇది సుమారు రూ. 80,844 కోట్ల పెరుగుదలని వివరించారు. జాతీయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ..: మౌలిక రంగానికి ఊతం ఇచ్చే దిశగా జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి(ఎన్ఐఐఎఫ్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. దీనికి ఏటా రూ. 20,000 కోట్ల మేర నిధులు దక్కేలా చూడనున్నట్లు వివరించారు. ఇది ఐఆర్ఎఫ్సీ, ఎన్‌హెచ్‌బీ వంటి మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయగలదని తద్వారా ఇన్ఫ్రా సంస్థలకు నిధులు లభించగలవని పేర్కొన్నారు. రైలు, రహదారులు, నీటి పారుదల రంగ ప్రాజెక్టులకు సంబంధించి పన్నురహిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని కూడా అనుమతించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని జైట్లీ చెప్పారు. పీపీపీ విధానాన్ని సమీక్షించి, పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడితో కొత్తగా మరో 5 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామగ్రామానికీ రహదారులు..: ప్రస్తుతం రహదారి సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న 1,78,000 పైచిలుకు ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్లు జైట్లీ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే నిర్మాణంలో ఉన్న లక్ష కిలోమీటర్ల రహదారులతో పాటు మరో లక్ష కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇక పెట్రోలు, డీజిల్‌పై ప్రస్తుతం విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో కొంత భాగాన్ని రోడ్డు సెస్సు కింద మార్చాలని, ఈ నిధులను రహదారులు ఇతర ఇన్ఫ్రా ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగించాలని యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. -
ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాలో 6 దేశీ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వినూత్న ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో ఆరు దేశీ ప్రాజెక్టులు చోటు దక్కించుకున్నాయి. ఇందులో హైదరాబాద్‌కి చెందిన దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) చేపట్టిన నర్మదా కెనాల్ సోలార్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇదే కాకుండా ఢిల్లీ మెట్రో, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, టాటా పవర్‌కి చెందిన ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (గుజరాత్), ఇంటర్‌సెప్టర్ స్యూవేజ్ సిస్టమ్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్) ఈ జాబితాలో ఉన్నాయి. అత్యంత ప్రభావం చూపగలిగే వినూత్నమైన ప్రాజెక్టులతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100’ పేరిట అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ కేపీఎంజీ ఈ జాబితాను తయారు చేసింది. ప్రాజెక్టు వ్యయం, సంక్లిష్టత, సాధ్యాసాధ్యాలు, నవ్యత, సమాజంపై ప్రభావం అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించినట్లు కేపీఎంజీ వివరించింది. న్యూఢిల్లీ, ఆగ్రాను కలుపుతూ దాదాపు 165 కిలోమీటర్ల పొడవుండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌వే 2012లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి 1.9 బిలియన్ డాలర్ల వ్యయం అయ్యింది. ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాను అభివృద్ధి చేయగలిగే సత్తా భారత్‌కి ఉందని ఇది చాటిచెప్పగలదని కేపీఎంజీ వివరించింది. మరోవైపు, 2.3 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటైన ఢిల్లీ మెట్రో ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమిస్తూ మరింతగా విస్తరిస్తోందని పేర్కొంది. 4.4 బిలియన్ డాలర్ల ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు.. భారత విద్యుత్ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మైలురాయిలాంటిదని కేపీఎంజీ తెలిపింది. ఇక గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని 20 బిలియన్ డాలర్ల వ్యయంతో త లపెట్టారు. దాదాపు 400 వైవిధ్యమైన ప్రాజెక్టులను పరి శీలించి కేపీఎంజీ 100 సంస్థలను ఎంపిక చేసింది. ఎంఈఐఎల్ ప్రాజెక్టు..: 17.9 మిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన నర్మదా కెనాల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఎంఈఐఎల్ చేపట్టింది. కాంట్రాక్టులో భాగంగా దాదాపు 5.5 కిలోమీటర్ల పొడవునా కెనాల్‌పై సోలార్ ఫొటోవోల్టయిక్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి, 25 సంవత్సరాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టు. -
80% భూమి సేకరించాకే హైవే ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అవసరమైన భూమిలో కనీసం 80 శాతాన్ని సేకరించకుండా ఆయా ప్రాజెక్టులకు టెండర్లు పిలవబోమని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ సదస్సులో తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 10 శాతం భూమిని కూడా సేకరించకుండానే ప్రాజెక్టులు మొదలుపెట్టారనీ, రహదారుల రంగంలో నెలకొన్న సమస్యలకు ఇదే కారణమనీ విమర్శించారు. వచ్చే 5-10 ఏళ్లలో బిడ్డింగ్ నిర్వహించడానికి 300 ప్రాజెక్టులను అన్ని అనుమతులతో సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో అభివృద్ధి మందగించడానికి ఫైళ్లను త్వరగా క్లియర్ చేయకపోవడమే కారణమని గుర్తించినట్లు చెప్పారు. మౌలిక సౌకర్యాలు, వ్యాపారాల్లో సమయమే అత్యంత కీలకమైనదనీ, ఫైళ్లు మూడు నుంచి ఆరునెలల పాటు పెండింగులో ఉంటున్నాయనీ చెప్పారు. ఇలాంటి జాప్యాల కారణంగా దేశంపై రోజుకు రూ.15 కోట్ల భారం పడుతోందన్నారు. రైల్వేల నుంచి అనుమతులు లేకపోవడంతో 300కు పైగా రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పెండింగులో ఉందన్నారు. మౌలికం వృద్ధికి పటిష్ట పీపీపీ నమూనా మౌలిక రంగం అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక కార్యదర్శి అరవింద్ మయారామ్ సదస్సులో పేర్కొన్నారు. ఈ దిశలో పటిష్టవంతమైన, సంక్లిష్టతలకు తావులేని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధాన నమూనాకు రూపకల్పన చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. -
రైలు దారి మార్చుకుంటోంది....
న్యూఢిల్లీ : కూ చిక్ చిక్ అంటు వచ్చిన ఎన్డీయే రైలు బండి దారి మార్చుకుంటోంది. విదేశీ పెట్టుబడులకు రైల్వేశాఖ తలుపులు తెరుస్తోంది. రైల్వేలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే సూచనలు కనిపిస్తున్నాయి. పీపీపీల పేరు (ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం)తో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేపట్టింది. పదేళ్ల తర్వాత తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన బీజేపీ రైల్వేల్లో ఎఫ్‌డీఐలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ పద్దతిలో పనులు చేపడతామని రైల్వే మంత్రి సదానందగౌడ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వే శాఖ ఆత్మ వంటిదన్న సదానంద గౌడ 62 నిమిషాల ప్రసంగంలో ఎక్కువ సార్లు వినిపించిన పదం పీపీపీ. దేశం మొత్తంలో చాలా రంగాలు ప్రైవేటీకరణ చేతికి అప్పగించినాఇప్పటి వరకు రైల్వే శాఖను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను ధైర్యంగా ప్రభుత్వం చేయలేదు. ఒకవేళ రైల్వే శాఖలో కూడా ప్రైవేటు భాగస్వామ్యం కల్పిస్తే ఇక దేశం మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినట్టే అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విపక్షాలు కూడా మోడీ సర్కార్ రైల్వే శాఖను ప్రయివేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోందని విమర్శిస్తున్నాయి. నిజానికి కి ప్రధాని మోడీ ఎఫ్‌డిఐలకు ఇప్పటికే సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జమ్ము కాశ్మీర్ లో కాత్రా-ఉధంపూర్ రైల్వే లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. రైల్వే సంస్థ అభివద్ధి కోసం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరముందని మోడీ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఈ చర్యలు తప్పవని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.