సాక్షి విజయవాడ: కూటమి ప్రభుత్వం విజయవాడలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. పీపీపీ మోడల్‌లో (ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రభుత్వానికి చెందిన ఖాళీ భూములన్నీ మున్సిపల్ శాఖ టీడీపీ పెట్టుబడిదారుల చేతికి అప్పగించడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
18 నగరాలు, మున్సిపాలిటీలకు చెందిన దాదాపు 1,౩౦౦ వందల ఎకరాల భూమిని ల్యాండ్ మానిటైజేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. దీనికి సంబంధించి 73 ల్యాండ్ పార్సిల్స్ గుర్తించినట్లు ఎమ్ఏయూడీ ప్రకటించగా ఇదివరకే నాలుగు పట్టణాల్లో మున్సిపల్ శాఖ అధికారులు ఈఓఐ పిలిచారు. ఈ భుముల ధర వేల కోట్ల రుపాయలు ఉన్నట్లు సమాచారం.


