సాక్షి, అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు చేసిన అసత్య ఆరోపణలపై తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు స్పందించారు. మెడికల్ కళాశాల అభివృద్ధి పనులపై దమ్మూ ధైర్యం ఉంటే మెడికల్ కళాశాల వద్దకు రావాలని ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు సవాల్ విసిరారు.
మదనపల్లి మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు,నాయకులు చేరుకున్నారు. దాంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పై టీడీపీ నాయకులు దాడి చేశారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదని సమాచారం.


