సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్, ఎస్సీ సెల్ ప్రతినిధులు తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో టీడీపీ నేత వర్ల రామయ్యపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు అనంతరం, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకుడు కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కూటమి నేతలు ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ పర్యటనలో రప్పా.. రప్పా డైలాగ్ బ్యానర్‌ను వైఎస్ జగన్‌కు ఆపాదిస్తున్నారు. పుష్ప సినిమాలో డైలాగ్ సెన్సార్ కట్ చేయలేదు కాబట్టి అభ్యంతరం లేదు. వర్ల రామయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వర్ల రామయ్యపై చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.


