పీపీపీ విధానంలో ఐదు టెక్స్‌టైల్‌ పార్కులు | Cabinet gives its nod to several key policies in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పీపీపీ విధానంలో ఐదు టెక్స్‌టైల్‌ పార్కులు

Dec 4 2024 5:29 AM | Updated on Dec 4 2024 5:29 AM

Cabinet gives its nod to several key policies in Andhra Pradesh

ఏపీ టెక్స్‌టైల్స్‌ గార్మెంట్‌ పాలసీ–2024–29కి మంత్రిమండలి ఆమోదం

పలు పాలసీలకు కేబినెట్‌ ఆమోదం 

రాజధానిలో రూ.11,471 కోట్ల విలువైన పనులకు టెండర్లు 

డిసెంబర్‌ 15న ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి 

షిప్‌ సీజ్‌పై కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంది  

పీఎంఏవై ఇళ్లు 2026 మార్చికి పూర్తి 

గత ప్రభుత్వం అనుసరించిన మూడు ఆప్షన్ల మేరకే నిర్మాణం 

కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పార్థసారథి, నారాయణ

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఐదు టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈమేరకు ఏపీ టెక్స్‌టైల్స్‌ గార్మెంట్‌ పాలసీ–2024–29కి ఆమోదం తెలిపింది. రెండు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిలో సూక్ష్మ యూనిట్లకు 30 శాతం, మధ్య తరహా యూనిట్లకు 20 శాతం, పెద్ద పరిశ్రమలకు 25 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు.

సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయాలను మంత్రులు కె.పార్థసారథి, పి.నారాయణ మీడియా సమావేశంలో వివరించారు. పలు పాలసీలు, అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రులు వివరించారు. కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించాల్సి ఉందని మంత్రి తెలిపారు. 

మంత్రిమండలి ఇతర నిర్ణయాలు.. 
ఐటీ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ పాలసీ–2024–29కి ఆమోదం. దీని కింద ఐటీ సంస్ధల కోసం మౌలిక వసతులు కలి్పంచే డెవలపర్లకు, కో వర్కింగ్‌ స్పేస్, నైబర్‌హుడ్‌ వర్కింగ్‌ స్పేస్‌ అభివృద్ధి చేసే వారికి పలు రాయితీలు ఇస్తారు. ఐటీ కాంప్లెక్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్లు అభివృద్ది చేసే వారికి 50 శాతం కేపిటల్‌ రాయితీ ఇస్తారు.

కో వర్కింగ్‌ స్పేస్‌కు రాయితీకి కనీసం 100 సీట్ల సామర్ఢ్యం లేదా 10 వేల చదరపు అడుగుల కార్యాలయ సముదాయం ఉండాలి. నైబర్‌హుడ్‌ వర్కింగ్‌ స్పేస్‌కు పది సీట్ల సామర్ధ్యం లేదా వెయ్యి చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ ఉండాలి. కో–వర్కింగ్‌లో సీటుకు నెలకు రూ.2 వేలు, నైబర్‌హుడ్‌ వర్కింగ్‌ స్పేస్‌లో సీటుకు నెలకు రూ.1000 చొప్పున 6 నెలలు రాయితీ ఇస్తారు. 5 లక్షల చదరపు అడుగుల ఫ్లోర్‌ ఏరియా పైబడిన ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేసేవారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ ఇస్తారు. 

⇒  పీఎంఏవై కింద నిర్మాణం ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోని 6.41 లక్షల ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1.90 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని 2026 మార్చికల్లా పూర్తి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుసరించిన మూడు ఆప్షన్ల విధానంలో, అదే యూనిట్‌ విలువకు వీటిని నిర్మిస్తారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని నిర్ణయించింది.  

⇒ పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంతో ఏపీ మారిటైమ్‌ పాలసీ–2024–29కి ఆమోదం. మెగా పోర్టు మంజూరుకు ప్రయతి్నంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. 

⇒ టూరిజంకు పారిశ్రామిక హోదా కలి్పస్తూ నూతన విధానానికి ఆమోదం. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో టెంపుల్, ఎకో టూరిజం, వెల్‌నెస్, అగ్రీ సర్క్యూట్‌ ప్రాజెక్టులు చేపడతారు. 
⇒  పౌర సేవల సులభతరం, వాట్సాప్‌ ద్వారా అన్ని సరి్టఫికెట్లు అందించడం లక్ష్యంగా ఆర్టిజీఎస్‌ పాలసీ–2024–29కు ఆమోదం.

⇒ ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రికల్‌ మొబిలిటీ పాలసీ–2024–29కి ఆమోదం. రాజధానిని ఎలక్ట్రికల్‌ మొబిలిటీ సిటీగా తీర్చిదిద్దేలా పాలసీ. దీని ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడి, 60 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. విద్యుత్‌ వాహనాలు కొనే వారికి రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ.  
⇒ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన  శ్రీకాకుళం జిల్లా  ఉద్ధానం, పులివెందుల, డోన్‌ తాగునీటి ప్రాజెక్టుల ధరల జీవో 62 ద్వారా సవరణకు ఆమోదం. 

⇒  ఆయుర్వేద, హోమియోపతిక్‌ బోర్డుల పేర్లను మార్చడం, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టమ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ యాక్ట్‌ 2020 కి అనుగుణంగా బోర్డు పునరి్నర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 
⇒ డిసెంబర్‌ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. ఆయన జన్మస్థలంలో నివాసం ఉన్న ఇంటిని మ్యూజియంగా తీర్చిదిద్దాలని, ఆయనపై లఘు చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయం. 

⇒ రాజధానిలో గతంలో చేపట్టి, పూర్తికాకుండా ఉన్న రూ.7,391.65 కోట్ల విలువైన పనుల్లో 18 పనులను తిరిగి చేపట్టేందుకు రూ.11,471 కోట్లకు ఈ నెలలో టెండర్లను ఆహా్వనించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెలలో టెండర్లు పూర్తిచేసి, మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ధరలు, జీఎస్‌టీ, డ్యామేజీ కారణంగా ఈ పనుల వ్యయం 30 శాతం పెరిగినట్లు మంత్రులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement