
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్టీ నేతలతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో జరగనున్న ఈ భేటీకి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు.
తాజా రాజకీయ పరిణామాలు, పార్టీబలోపేతం గురించి ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు ఇదివరకే తెలిపాయి. అంతేకాదు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం, రాష్ట్రంలో యదేచ్ఛగా నడుస్తున్న నకిలీ మద్యం వ్యవహారంపైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జగన్ హయాంలో మొదలైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటానికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించిన.. మాకవరం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు.

ఇదీ చదవండి: బాబు చీటర్.. లోకేష్ లూటర్!