
సాక్షి, విశాఖపట్నం: తమ కుట్రలు విఫలం కావడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తే.. వైఎస్సార్‌సీపీ కేడర్ సైతం విస్తుపోయే రేంజ్‌లో సూపర్ సక్సెస్ కావడంతో అధికార టీడీపీ ఇప్పుడు అంతర్మధనంలో పడిపోయింది(YS Jagan Uttarandhra Tour Success).
జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని ఆంక్షల పేరిట ఆటంకాలు సృష్టించింది కూటమి ప్రభుత్వం. ఖాకీలను ప్రయోగించి జనాన్ని రాకుండా ప్రయత్నించింది. అయితే చెక్‌పోస్టులు, బారికేడ్లను జగన్ మీద ఉన్న అభిమానం బద్దలు కొట్టేసింది. జనాలు తండోపతండాలుగా తరలి రావడం చూసి పోలీసులే కంగుతిన్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు.. దారి పొడవునా జగన్ ఆగిన చోటల్లా ఇసకేస్తే రాలని జనమే కనిపించారు. ఆంక్షల వలయాన్ని చేధించుకుని.. గుట్టలు, పొలాల గుండా కొందరు యువకులు బైకులపై తరలి రావడం గమనార్హం.

తొలుత.. ఈ పర్యటన కోసం దళితులను వాడుకోవాలని అధికార టీడీపీ విశ్వప్రయత్నాలు చేసింది. డాక్టర్ సుధాకర్ పేరుతో హోర్డింగులు ఏర్పాటు చేయించడంతో పాటు ఫకార్డుల ప్రదర్శన చేయించాలని స్కెచ్ వేసింది. అయితే దళితులు ఆ కుట్రలకు లొంగలేదు. పైపెచ్చు జగన్ ర్యాలీకి భారీగా తరలి వచ్చారు. వివిధ వర్గాలు సైతం జగన్‌ను కలిసి తమ గోడును వెల్లదీసుకోవడం.. ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడని విషయం. ఇంకోవైపు..

చివరకు ప్రకృతిపైనా పచ్చ బ్యాచ్ ఆశలు పెట్టుకోగా.. అది నెరవేరలేదు. కుండపోత వర్షంలోనూ రోడ్డు పొడవునా.. మహిళలు, వృద్ధులు, రైతులు బారులు తీయడం.. ఎల్లో మీడియాకు సైతం సహించనట్లుంది. అందుకే ట్రాఫిక్ జామ్, షరతుల ఉల్లంఘన పేరుతో విషం చిమ్ముతోంది. వెరసి..
ఊహించని రీతిలో జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సక్సెస్ కావడంతో కరకట్ట బంగ్లాకు ఏం సమాధానం చెప్పుకోవాలో అని ఉత్తరాంధ్ర తమ్ముళ్లు తెగ మదనపడిపోతున్నారు.
క్లిక్ చేయండి: ఉత్తరాంధ్రలో జగన్ కోసం జన సునామీ.. చూశారా?