
సాక్షి,విశాఖ: పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి రూ. 3 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024,సెప్టెంబర్ 24న కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు నిందితుడు చిత్తరంజన్ ఏడవ తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక తన తోటి విద్యార్థులు తనపై జరుగుతున్న లైంగిక దాడికి గురించి చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. టీచర్ల సాయంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజా కేసు విచారణలో విశాఖ కోర్టు నిందితుడు చిత్తరంజన్‌కు కఠిన శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.