అందరూ గర్వపడే సినిమా కోర్ట్‌: చిరంజీవి | Mega Star Chiranjeevi Appreciated Court Movie Team | Sakshi
Sakshi News home page

అందరూ గర్వపడే సినిమా కోర్ట్‌: చిరంజీవి

Apr 1 2025 3:04 AM | Updated on Apr 1 2025 3:04 AM

Mega Star Chiranjeevi Appreciated Court Movie Team

∙ప్రియదర్శి, రోషన్, చిరంజీవి, శ్రీదేవి, రామ్‌ జగదీష్‌

‘‘కోర్ట్‌’ సినిమా చూశాను.. ఎక్కడా బోర్‌ కొట్టలేదు. కథని ఆద్యంతం ఆసక్తిగా తీశారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు.. ప్రతి పాత్ర సహజంగా ఉంది. ఈ మూవీని కేవలం ఒక ఎంటర్‌టైన్మెంట్‌ ఫిల్మ్‌లా కాకుండా ఒక ఎడ్యుకేటివ్‌ కోర్ట్‌ డ్రామాగా భావిస్తున్నాను. అందరూ గర్వపడే సినిమా ‘కోర్ట్‌’’ అని హీరో చిరంజీవి తెలిపారు. ప్రియదర్శి, శివాజి, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్‌’. రామ్‌ జగదీష్‌ దర్శకత్వం వహించారు.

నాని వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం మార్చి 14న విడుదలై, హిట్‌గా నిలిచింది. తాజాగా ‘కోర్ట్‌’ చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించి, సత్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ–‘‘కోర్ట్‌’లో చాలా బలమైన సందేశం ఉంది. నాని ఒక కథపై ఆసక్తి చూపించారంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్‌లోనే చూడాలి’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement