సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష | Suryapet District Court Sensational Verdict | Sakshi
Sakshi News home page

సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష

Apr 11 2025 8:13 PM | Updated on Apr 11 2025 8:30 PM

Suryapet District Court Sensational Verdict

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతుర్ని చంపిన కేసులో తల్లికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. మానసిక స్థితి సరిగ్గాలేదని కన్న కూతుర్నే తల్లి చంపేసింది. మోతె మండలం మేకపాటి తండాలో 2021, ఏప్రిల్‌లో జరిగిన ఘటనలో ఇవాళ జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది.

నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు..
నాంపల్లి పోక్సో కోర్టు కూడా ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. బాలికపై లైంగికదాడి యత్నం చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2023లో రాజ్ భవన్ మక్త ప్రాంతంలో బాలికపై అత్యాచారయత్నం జరిగింది. సెల్‌ఫోన్‌ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి శ్రీనివాస్‌ అనే వ్యక్తి లైంగికదాడి యత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై పోలీసులపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌కు 25 జైలు శిక్షతో పాటు కోర్టు జరిమానా విధించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement