‘సేతు బంధన్‌’ నిధులతో బ్రిడ్జి నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

‘సేతు బంధన్‌’ నిధులతో బ్రిడ్జి నిర్మాణం

Jul 13 2026 5:42 AM | Updated on Jul 13 2026 5:42 AM

అప్రమత్తత అవసరం..

నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కేసుల వివరాలు..

నార్కట్‌పల్లి : ‘సేతు బంధన్‌’ పథకం ద్వారా రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.76 లక్షలతో నార్కట్‌పల్లి – మునుగోడు రోడ్డులో రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నార్కట్‌పల్లి సమీపంలో రైల్వే రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 117 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కై వసం చేసుకొని మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉదయ సముద్రం కాల్వ పనులను పూర్తిచేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించి రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే తన ధ్యేయమన్నారు. నార్కట్‌పల్లిలో రోడ్డు విస్తరణ పనులను త్వరలో పూర్తి చేస్తానని, నార్కట్‌పల్లి నుంచి మాండ్ర వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణం పూర్తిచేసి ప్రజల సమస్య తీర్చుతామన్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను పూర్తి చేస్తామన్నారు. 2028 వరకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పూర్తిచేసి సాగు, తాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, సేతుబందు సీఆర్‌ఐఎప్‌ చీఫ్‌ వసంతనాయక్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, ఆర్డీవో అశోక్‌రెడ్డి, సర్పంచ్‌లు జెరిపోతుల భరత్‌కుమార్‌, నేతగాని కృష్ణ, ఇల్లందుల లింగస్వామి, కొంపెల్లి సైదులు, చిరుమర్తి ధర్మయ్య, మచ్చ జయసుధ ముత్యాలు, దొండ రమేష్‌, స్వామి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాయం శ్యాంసుందర్‌రెడ్డి, బత్తుల ఉషయ్య, వడ్డె భూపాల్‌రెడ్డి, సట్టు సత్తయ్య, పుల్లెంల అచ్చాలు, శ్రీనివాస్‌, రామ్‌రెడ్డి, శిరీష ప్రవీణ్‌రెడ్డి, గడ్డం పశుపతి, ప్రజ్ఞాపురం సత్తి, సంపత్‌ పాల్గొన్నారు.

జలుబు, జ్వరంతో ఆస్పత్రుల బాటపడుతున్న రోగులు

జీజీహెచ్‌, ఏరియా ఆస్పత్రుల్లో పెరిగిన ఓపీ

ప్రభుత్వ వైద్యశాలల్లో బెడ్లు,

మందులు సిద్ధం చేసిన

వైద్య ఆరోగ్యశాఖ

అప్రమత్తంగా

ఉండాలని వైద్యుల సూచన

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోజుకు 700 నుంచి 750 వరకు ఓపీ నమోదువుతోంది. ఇందులో చాలా మంది మంది జ్వరం, జలుబు, వైరల్‌ లక్షణాలతో వైద్యులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే జ్వరం ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో సీజనల్‌ వ్యాధుల కేసులు నమోదు సాధారణంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో రోగుల సంఖ్య పెరిగితే ఇబ్బందులు కలగకుండా అధికారులు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఆస్పత్రిలో వైద్యులను కలిసేందుకు, పరీక్షలు చేయించుకోవడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని పలువురు రోగులు చెబుతున్నారు. దీంతో ఓపీ విభాగంలో తీవ్ర రద్దీ నెలకొంటోంది.

‘ఇందిరమ్మ’ కు కొత్త రూల్స్‌!

ప్రస్తుతం వైరల్‌ జ్వరాలు, జలుబు కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం రెండు మూడు రోజులకు మించి కొనసాగినా, తీవ్ర తలనొప్పి, వాంతులు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా డెంగీ, ఇతర సీజనల్‌ వ్యాధులను నివారించవచ్చని చెబుతున్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఫ నార్కట్‌పల్లి – మునుగోడు రోడ్డులో

రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement