నల్లగొండ టౌన్ : అఖిల భారత రైతు సంఘం మహాసభలు నల్లగొండలో నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి వెల్లడించారు. మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం ఈ నెల 17న జిల్లాకేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం నల్లగొండలో జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ఆహ్వాన సంఘ సమావేశానికి అఖిలభారత ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను, ఎరువులను అరికట్టాలని, యూరియా బుకింగ్ యాప్ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు డిస్కమ్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వి.వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, అశోక్‌రెడ్డి, మంగారెడ్డి, నలపరాజు సైదులు, చాపల మారయ్య, అర్రూరి శ్రీనివాస్, సాగర్ల మల్లేష్, ఎం.వినోద్‌నాయక్, ముత్తులింగం, కంచర్ల ఊర్మిల, ఆంజనేయులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు
అందించాలి
హాలియా : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ రాహుల్ అన్నారు. ఆదివారం హాలియా పట్టణంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల పంపిణీ విధానం, ఓపీ, రికార్డులను పరిశీలించి మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ దీప, డాక్టర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.
విశ్వకర్మ సంఘం
జిల్లా కమిటీ ఎన్నిక
నల్లగొండ టౌన్ : తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం నల్లగొండలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా గుంటోజు వెంకటాచారి, ఉపాధ్యక్షుడిగా శిరసగండ్ల ఈశ్వరాచారి, కోశాధికారిగా సంకోజు జేజయ్య, ప్రచార కార్యదర్శిగా పోలోజు శివకుమార్, కార్యదర్శిగా తుంగతుర్తి శంకర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని సన్మానించారు. కార్యక్రమంలో సమాశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకోజు కృష్ణ్ణమాచారి, కాసోజు విశ్వనాథంచారి, చక్రహరి రామరాజు, గణేష్‌చారి, తాటికొండ శ్రీరాములు, శ్రీనివాసాచారి, కె.కె. చారి, ఆనందోజు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, బ్రహ్మచారి, రామరాజు, పోలోజు రమేష్‌చారి, గుంటోజు బ్రహ్మచారి, కాసోజు శంకరాచారి పాల్గొన్నారు.


