భక్తులతో కిక్కిరిసిన ఆలయ మాడ వీధులు
నిత్య కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో ఆదివారం నిత్య కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. వేకువజామునే స్వామి అమ్మవార్లకు సుప్రభాతం చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం జరిపించారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధిలో స్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు
ఊరేగించారు.


