నులిపురుగులకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

నులిపురుగులకు చెక్‌

Jul 13 2026 5:42 AM | Updated on Jul 13 2026 5:42 AM

తప్పనిసరిగా మాత్రలు వేయించాలి

పెద్దవూర : పిల్లల ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లలు రోగాల బారిన పడతారు. అపరిశుభ్రత కారణంగా కడుపులో నులిపురుగులు తయారవుతాయి. మల, మూత్ర విసర్జణ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకపోవడంతో నులిపురుగుల బారిన పడిన పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఫిబ్రవరి, ఆగస్టు మాసాలలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ నెల 13 నుంచి 1 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది.

విద్యా సంస్థల్లో పంపిణీ..

జిల్లా వ్యాప్తంగా 17,00,228 మంది జనాభా ఉండగా అందులో ఒకటి నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్నవారు 3,90,134 మంది ఉన్నారు. వీరందరికి ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయనున్నారు. 8 మున్సిపాలిటీలు, 32 మండలాలు, 844 రెవెన్యూ గ్రామాలు, 34 పీహెచ్‌సీల పరిధిలో 2093 అంగన్‌వాడీ కేంద్రాలు, 1556 ప్రభుత్వ పాఠశాలలు, 404 ప్రైవేట్‌ పాఠశాలలు, 13 జూనియర్‌ కళాశాలలు, 5 పాలిటెక్నిక్‌ కళాశాలు, 11 ఒకేషనల్‌ కళాశాలల్లో కలిపి 3,90,134 మందికి మందలు పంపిణీ చేయనున్నారు. వీరికోసం 4,17,400 ఆల్బెండజోల్‌ మాత్రలను సిద్ధంగా ఉంచారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది సహకారంతో సోమవారం, 20వ తేదీన ఢీ వార్మింగ్‌ డే ద్వారా నులిపురుగుల నిర్మూలనకు మాత్రలు వేయనున్నారు.

మాత్రల డోసులు ఇలా..

జబ్బుతో ఉన్నా లేదా ఏదైనా ఇతర మందులు వాడుతున్న పిల్లలకు ఈ నులిపురుగుల నివారణ మాత్రలు ఇవ్వకూడదు. ఏడాది పిల్లలకు మాత్రలు వేయకూడదు. ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు ఆల్బెండజోల్‌ సగం మాత్రను లేదా సిరప్‌ను 5 మిల్లీలీటర్లు ఇవ్వాలి. రెండు నుంచి పంతొమ్మిదేళ్ల పిల్లలకు ఒక మాత్రను మధ్యాహ్న భోజనం తర్వాత నమిలి మింగేలా చూడాలి. పిల్లలు మాత్రను మింగకుండా వైద్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది పర్యవేక్షించాలి.

తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్‌ మాత్రలను వేయించాలి. 13వ తేదీన నులిపురుగుల మాత్రలు పంపిణీ చేస్తున్నాం. అనివార్య, అనారోగ్య కారణాలతో మాత్రలు వేసుకోని వారికోసం ఈ నెల 20వ తేదీన మరోసారి ఇస్తాం. జిల్లాలో ఒకటి నుంచి 19 ఏళ్ల మద్య ఉన్న వారు మాత్రలు వేసుకోవాలి.

– డాక్టర్‌ పద్మ, జిల్లా ఇమ్యూనిటీ ఆఫీసర్‌

ఫ నేడు ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

ఫ 1 నుంచి 19 ఏళ్లలోపు వయస్సువారు 3,90,134 మంది ఉన్నట్లు గుర్తింపు

ఫ 4,17,400 మాత్రలు సిద్ధం చేసిన

కుటుంబ సంక్షేమశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement