
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్(Unni Mukundan)కు కేరళ కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఉన్నిముకుందన్‌పై తన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. టోవినో థామస్ నటించిన నరివెట్ట సినిమాను ప్రశంసిస్తూ ఉన్నిముకుందన్‌ను ఆయన కించపరిచాడు. దీంతో ముకుందన్‌కు కోపం వచ్చింది. ఈ కారణంగానే విపిన్ కుమార్‌పై దాడి చేశాడని సమాచారం. దీంతో ఉన్ని ముకుందన్ తనపై దుర్భాషలాడారని, దాడి చేశారంటూ ఈ ఏడాది మే నెలలో విపిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విపిన్ కుమార్ ఫిర్యాదుతో ఉన్నిముకుందన్‌పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాలుగా సీసీటీవీ ఫుటేజ్ వీడియోను అందించారు. దీంతో తాజాగా కేరళలోని కాకనాడ్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, విపిన్ చేసిన ఆరోపణలను ముకుందన్ కొట్టిపారేశారు. తాను విపిన్ కళ్లద్దాలు మాత్రమే పగలగొట్టానని ఒప్పుకున్నారు. కానీ, మార్కో సినిమా ఫెయిల్ కావడంతోనే ఉన్నిముకుందన్ ఇలా ఒత్తిడికి లోనయ్యాడని విపిన్ చెప్పడం విశేషం.