అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ  | USA citizen held by ICE despite judge seeing birth certificate | Sakshi
Sakshi News home page

అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ 

Apr 19 2025 5:47 AM | Updated on Apr 19 2025 8:57 AM

USA citizen held by ICE despite judge seeing birth certificate

మయామి: దేశంలో అక్రమంగా ఉంటున్నాడంటూ అమెరికా పౌరుడొకరిని యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత పత్రాలన్నిటినీ అతడి తల్లి చూపినా వదల్లేదు. చివరికి కోర్టు జోక్యంతో అతడికి విముక్తి లభించింది. బుధవారం కారులో వెళ్తున్న జువాన్‌ కార్లోస్‌ లోపెజ్‌ గోమెజ్‌ (20) అనే వ్యక్తిని ఫ్లోరిడా హైవే పెట్రోల్‌ అధికారులు జార్జియా రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకున్నారు. 

దేశంలో అక్రమంగా ఉండే వారికి జార్జియాలోకి ప్రవేశం నిషిద్ధం. ఆ నిబంధనను సాకుగా చూపు తూ గోమెజ్‌తోపాటు ఆ కారులో ఉన్న వారందరినీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అతడి తల్లి వచ్చి పౌరసత్వ కార్డు సహా ఆధారాలన్నీ చూపినా ససేమిరా అంటూ లియోన్‌ కౌంటీ జైలుకు వారిని తరలించారు. 

కేసు విచారణ సమయంలో గోమెజ్‌ తల్లి స్టేట్‌ ఐడెంటిటీ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్, సోషల్‌ సె క్యూరిటీ కార్డు చూపారు. దీంతో, ఇమిగ్రేషన్‌ అధి కారుల చర్యకు ఎటువంటి ఆధారాలు లేవంటూ గోమెజ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ పరిమాణంపై ఇమిగ్రేషన్‌ విభాగం స్పందించలేదు. దేశ పౌరులను అదుపులోకి తీసుకునే అధికారం యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement