
యాక్షన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో నాని.. నిర్మాతగానూ ఓ మూవీని విడుదలకు సిద్ధం చేశాడు. అదే 'కోర్ట్'. ప్రియదర్శి ప్రధాన పాత్రధారి. రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ డార్క్ కామెడీ)
ట్రైలర్ బట్టి చూస్తే.. తన కూతురితో ప్రేమలో ఉన్నాడనే కోపంతో ఓ తండ్రి.. ఓ కుర్రాడిపై కేసు పెడతాడు. ఏకంగా పోక్సో కేసు బనాయిస్తాడు. అలా 78 రోజుల పాటు జైల్లో మగ్గుతాడు. పోక్సో లాంటి సెన్సిటివ్ కేసు కావడంతో లాయర్స్ ఎవరూ ముందుకు రారు. అలాంటిది ప్రియదర్శి ఈ కేసు వాదించేందుకు సిద్ధమవుతాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ అనిపిస్తుంది.
నాని నిర్మాత అంటే కాస్త వైవిధ్యభరిత చిత్రాలే వస్తుంటాయి. 'కోర్ట్' ట్రైలర్ చూస్తుంటే సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలానే ఉంది. కోర్ట్ రూమ్ డ్రామాలు ఈ మధ్య కాలంలో తెలుగులో ఏం రాలేదు. రామ్ జగదీశ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment