షారుక్ ఖాన్‌, దీపికా పదుకొణెకు ముందస్తు బెయిల్‌ | Rajasthan High Court Grants Bail to Shah Rukh Khan and Deepika Padukone in Hyundai Ad Controversy Case | Sakshi
Sakshi News home page

షారుక్ ఖాన్‌, దీపికా పదుకొణెకు ముందస్తు బెయిల్‌

Sep 11 2025 11:30 AM | Updated on Sep 11 2025 11:34 AM

Rajasthan Court Issue Anticipatory Bail To Shahrukh Khan And Deepika padukone

బాలీవుడ్‌ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), దీపికా పదుకొణెలకు రాజస్థాన్‌ హైకోర్టు ముందస్తు బెయిల్మంజూరు చేసింది.  హ్యుందాయ్‌ కార్ల కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్న షారుక్‌, దీపికాలపై రాజస్థాన్‌కు చెందిన కీర్తిసింగ్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కార్ల కంపెనీ ప్రచారం చేయడం వల్ల తాను ఒక కారు కొనుగోలు చేసి నష్టపోయానని, వారిద్దరూ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన కేసు వేశారు. అయితే, ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని రాజస్థాన్‌ హైకోర్టును నటీనటులు కూడా ఆశ్రయించారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం వారికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 25 ఉంటుందని పేర్కొంది.

గతంలో కీర్తి సింగ్ చేసిన ఫిర్యాదు ఇలా ఉంది. 2022 జూన్ నెలలో హ్యుందాయ్ కంపెనీ అల్కాజార్ కారును సుమారు రూ. 24 లక్షలకు కొనుగోలు చేస్తే.. కేవలం ఆరు నెలల్లోనే కారు ఇంజన్‌లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నాడు. అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజన్‌ నుంచి తీవ్రమైన శబ్ధం వస్తుందని ఒక్కోసారి దారి మధ్యలోనే ఆగిపోతుందని తెలిపాడు. కారు సమస్య గురించి కంపెనీ ఏజెన్సీని సంప్రదించినప్పుడు, ఇది ఈ కారు మోడల్ తయారీ లోపమంటూ దాన్ని పరిష్కరించలేమని అక్కడి సిబ్బంది చెప్పినట్లు ఆయన పేర్కొన్నాడు. నిర్లక్ష్యంతో సమాధానం చెప్పడంతో తాను కోర్టును ఆశ్రయించానని తెలిపాడు. హ్యూందాయ్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా పనిచేస్తున్న షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె( Deepika Padukone) ఈ ఘటనలో బాధ్యత వహించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement