కాగ్నిజెంట్‌ సమాచారాన్ని ఇన్ఫోసిస్‌ దుర్వినియోగం? | Infosys vs Cognizant Antitrust Trial Set for 2027 by US Federal Court | Sakshi
Sakshi News home page

కాగ్నిజెంట్‌ సమాచారాన్ని ఇన్ఫోసిస్‌ దుర్వినియోగం?

Sep 17 2025 11:34 AM | Updated on Sep 17 2025 12:35 PM

why US Court Sets Trial Date Infosys Cognizant Antitrust Dispute

ప్రముఖ ఐటీ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు ఇన్ఫోసిస్‌-కాగ్నిజెంట్‌ మధ్య నెలకొన్న యాంటీట్రస్ట్‌ వివాదాన్ని యూఎస్ ఫెడరల్ కోర్టు అధికారికంగా ఫిబ్రవరి 1, 2027న ఉన్నత స్థాయి జ్యూరీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. టెక్సాస్ నార్తర్న్ డిస్ట్రిక్ట్ (డల్లాస్ డివిజన్) కోర్టు ఇటీవల ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విచారణ ప్రారంభానికి ముందు జనవరి 25, 2027న ప్రీ-ట్రయల్ కాన్ఫరెన్స్‌ను షెడ్యూల్ చేసినట్లు కోర్టు పేర్కొంది.

అసలు వివాదం ఏంటి?

బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ట్రైజెట్టోకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. హెల్త్‌కేర్‌ ఐటీ స్పేస్‌లో పోటీని బలహీనపరుస్తూ, ప్రత్యర్థి ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ ఈ సమాచారాన్ని ఉపయోగించిందని దావాలో పేర్కొంది.

ఇన్ఫోసిస్ వాదన..

ఇన్ఫోసిస్ దీనిపై స్పందిస్తూ ఈ వాదనలను ఖండించింది. హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌ మార్కెట్‌లోకి ఇతర కంపెనీలు ప్రవేశించకుండా నిరోధించడానికి కాగ్నిజెంట్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుందని ఆరోపించింది. మేధో సంపత్తిని రక్షించడం కంటే పోటీని అణచివేసే లక్ష్యంతోనే కాగ్నిజెంట్ ముందుకెళ్లిందని కౌంటర్ క్లెయిమ్‌లో పేర్కొంది. 2024లో ప్రారంభమైన ఈ చట్టపరమైన వివాదంపై 2027లో విచారణ జరగనుంది.

మధ్యవర్తిత్వం అవసరం..

యాంటీట్రస్ట్ చట్టాలు, ధరల వ్యూహాలు, క్లయింట్ కాంట్రాక్ట్ నిర్మాణాలు, పోటీ మార్కెట్ డైనమిక్స్ సంక్లిష్ట స్వభావాన్ని బట్టి ఈ కేసు నిపుణుల సాక్ష్యంపై ఎక్కువగా ఆధారపడుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసు విచారణకు చేరుకునే ముందే ఇరు వర్గాలు సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. అందుకు జులై 9, 2026 నాటికి మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి చేసింది. రెండు పార్టీలు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాలని లేదా జులై 16, 2026 నాటికి దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పింది.

ఇదీ  చదవండి: బిగ్‌ రిలీఫ్‌! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement