ట్విషా శర్మ మృతి కేసు.. సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు | Twisha Sharma death case goes to Supreme Court | Sakshi
Sakshi News home page

ట్విషా శర్మ మృతి కేసు.. సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు

May 23 2026 11:10 PM | Updated on May 23 2026 11:10 PM

Twisha Sharma death case goes to Supreme Court

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును శనివారం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే 25) ఈ కేసుపై విచారించే అవకాశం ఉంది. 

33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన అత్తవారింట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలినప్పటికీ, ఆమె కుటుంబం ఈ నిర్ధారణలను తిరస్కరిస్తూ, ఇందులో కుట్ర ఉందని ఆరోపిస్తోంది. 

కాగా ఈ కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమె భర్త  సమర్థ్ సింగ్.. శుక్రవారం జబల్‌పూర్ జిల్లా కోర్టులో లొంగిపోవడానికి వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి భోపాల్ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో అతడిని భోపాల్ కోర్టు శనివారం 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్ వృత్తిరీత్యా న్యాయవాది కాగా, ఆమె అత్తగారు గిరిబాల సింగ్ పదవీ విరమణ చేసిన రిటైర్డ్ న్యాయమూర్తి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement