breaking news
Twisha Sharma
-
‘నీకు ఇంగ్లీష్‌లో మాట్లాడటం రాదు.. అందుకే నీ ఉద్యోగం ఊడింది’
భోపాల్: దేశవ్యాప్తంగా కలకలం రేపిన త్విషా శర్మ మరణం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కోర్టులో దాఖలు చేసిన తొలి ఛార్జ్‌షీట్‌లో త్విషా ఎదుర్కొన్న మానసిక వేధింపుల వెనుక ఉన్న ఆర్థిక కోణాన్ని, చైనా షేర్ మార్కెట్ బెట్టింగ్ గుట్టును సీబీఐ విప్పింది.ఆర్థిక పరమైన ఒత్తిడితో పాటు, త్విషా ఉద్యోగం కోల్పోయిన తర్వాత భర్త ఆమెను తీవ్రంగా అవమానించేవాడని సీబీఐ తెలిపింది. ‘నీకు ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాదు.అందుకే నీ ఉద్యోగం ఊడింది’ అంటూ భర్త సమర్థ్ సింగ్ ఆమెను నిరంతరం మానసికంగా వేధించేవాడని దర్యాప్తులో తేలింది.అత్తగారింట్లో తనపై ఇద్దరు నిందితులు నిరంతరం నిఘా ఉంచినట్లు త్విషా గతంలో తన తల్లిదండ్రులకు చెప్పి బాధపడింది. సీబీఐ నివేదిక ప్రకారం.. త్విషా శర్మకు ఉన్న ఒక డీమ్యాట్ ఖాతాలో సుమారు రూ. 20 లక్షల విలువైన ఈక్విటీ పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్.. ఆ డబ్బును తమకు బదిలీ చేయాలంటూ త్విషాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక జాయింట్ అకౌంట్‌ను కూడా తెరిచారు.కానీ, ఆ డబ్బు తన తండ్రికి చెందిందని చెబుతూ త్విషా దాన్ని బదిలీ చేయడానికి నిరాకరించడంతో అత్తాకోడళ్ల వేధింపులు మరింత పెరిగాయి.త్విషా శర్మ మరణించిన ఈ ఏడాది మే 12 రాత్రి 7:51 గంటల సమయంలో ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసి, చైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి భర్త సమర్థ్ తనపై ఒత్తిడి తెస్తున్నాడని వాపోయింది. తాను తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు స్నేహితురాలికి చెప్పిన కొన్ని గంటల్లోనే త్విషా అనుమానాస్పద స్థితిలో మరణించింది. కట్నం వేధింపులు,అనుమానాస్పద మృతి కోణాల్లో సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. -
ట్విషా శర్మ కేసు: సీబీఐకి సహకరించని అత్త, భర్త
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి సహకరించకపోవడంతో, మాజీ జిల్లా జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌ల జ్యుడీషియల్ కస్టడీని భోపాల్ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. నిందితులు వాయిస్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా, దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది.గతంలోనే నిందితుల నుంచి వాయిస్ శాంపిల్స్ సేకరించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, జైలులో అధికారులు శాంపిల్స్ కోసం ప్రయత్నించగా, సమర్థ్ సింగ్ నిరాకరించారని, గిరిబాల సింగ్ కేవలం పాక్షికంగా మాత్రమే సహకరించారని సీబీఐ పేర్కొంది. డిజిటల్ సాక్ష్యాల ఫోరెన్సిక్ విశ్లేషణ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలు రావాల్సి ఉందని, పలువురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాల్సి ఉందని దర్యాప్తు సంస్థ తెలిపింది.ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, జూలై 28 వరకు వారి కస్టడీని పొడిగిస్తూ, మరోసారి వాయిస్ శాంపిల్స్ సేకరించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కాగా మే 12న భోపాల్‌లోని కతారా హిల్స్ నివాసంలో ట్విషా శర్మ మృతి చెందారు. ఇది ఆత్మహత్య అని అత్తమామలు వాదిస్తుండగా, ఆమెది హత్యేనని త్విష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
నటి త్విషా శర్మ కేసులో కీలక పరిణామం.. తర్వాత ఏం జరగబోతోంది?
ఇండోర్: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో సరికొత్త మలుపు చోటు చేసుకుంది. త్విషా శర్మది ఆత్మహత్య కాదని, ఆమెను దారుణంగా హత్య చేశారని నిర్ధారించేలా బలమైన శాస్త్రీయ ఆధారాలు లభ్యమయ్యాయి ఆమె శరీరంపై ఉన్న గాయాల గుర్తులు జిమ్ బెల్ట్ వల్ల ఏర్పడినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం తేల్చింది . ఈ మేరకు సిద్ధం చేసిన 11 పేజీల సుదీర్ఘ నివేదికను ఎయిమ్స్ అధికారులు అత్యంత రహస్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అందజేశారు. సుప్రీంకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టుల ప్రత్యేక ఆదేశాల మేరకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని నిపుణుల బృందం త్విషా శర్మ చర్మ కణజాలాలను సేకరించి అత్యాధునిక హిస్టోపాథాలజీ పరీక్షలు నిర్వహించింది .ఈ శాస్త్రీయ పరీక్షల్లో ట్విషా శర్మ మెడ, శరీరంపై ఉన్న లోతైన గాయాలు, ఆమెను లొంగదీసుకుని ఉరి బిగించేందుకు జిమ్నాస్టిక్ లేదా జిమ్ బెల్టును క్రూరంగా ఉపయోగించడం వల్లే సంభవించాయని వెల్లడైంది ఈ మృతికి గల ఖచ్చితమైన కారణాలను, అంతర్గత గాయాలను విశ్లేషించడానికి మెడికల్ బోర్డు నెల రోజుల పాటు జాతీయ, అంతర్జాతీయ వైద్య జర్నల్స్, ఫోరెన్సిక్ శాస్త్రీయ పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించిందికోర్టు ఆదేశాల ప్రకారం నివేదికలోని పూర్తి వివరాలను బహిర్గతం చేయడానికి డాక్టర్ సుధీర్ గుప్తా నిరాకరించారు ఈ ఎయిమ్స్ నివేదిక ఆధారంగా ఇకపై సీబీఐ దర్యాప్తు జరిపి త్వరలోనే అసలు నిజానిజాలను, నిందితులను చట్టం ముందు నిలబెట్టనుందని ఆయన పేర్కొన్నారు నటి ట్విషా శర్మకు వివాహమైన కేవలం 5 నెలలకే, గత మే 12న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గల తన అత్తగారి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ట్విషా భర్త సమర్థ్ సింగ్ తల్లి గిరిబాలా సింగ్ ఒక విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కావడంతో, స్థానిక పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని, దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని త్విషా తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు స్థానిక పోలీసుల తీరుపై నమ్మకం లేకపోవడంతో వారు న్యాయం కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాధితుల అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం, ఈ కేసు దర్యాప్తును తక్షణమే సీబీఐకి బదిలీ చేయడమే కాకుండా, ఎయిమ్స్ చేత ఫోరెన్సిక్ రీ-ఎగ్జామినేషన్ చేయించాలని ఆదేశించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఎయిమ్స్ నివేదికతో ఈ కేసులో అత్తగారి కుటుంబ సభ్యుల చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. -
ట్విషా శర్మ మృతి కేసు: జైలుకు రిటైర్డ్ మహిళా జడ్జి
భోపాల్: ఒకప్పుడు కోర్టులో పలు కీలక తీర్పులు చెప్పిన ఉన్నత స్థాయి న్యాయమూర్తి, నేడు అదే చట్టం ముందు నిందితురాలిగా నిలబడ్డారు. తన కోడలు ట్విషా శర్మ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గిరిబాల సింగ్ భోపాల్ సెంట్రల్ జైలు పాలయ్యారు. నిన్నటి వరకు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఆమెకు, జైలు అధికారులు ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 71’ అనే గుర్తింపును కేటాయించారు.కోడలి మరణం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన మాజీ జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్‌లను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో మంగళవారం భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు నిబంధనల ప్రకారం మాజీ జడ్జిని మహిళా మెడికల్ వార్డులో ఉంచి, ఖైదీ నంబర్ 71ను కేటాయించారు. అలాగే ఆమె కుమారుడు సమర్థ్‌ను బ్యారక్ నంబర్ 4లో ఉంచి, ఖైదీ నంబర్ 1782గా గుర్తించారు. జైలు మాన్యువల్ ప్రకారం వీరికి ఒక ప్లేట్, గిన్నె, బెడ్‌షీట్ వంటి ప్రాథమిక అవసరాల వస్తువులను అధికారులు అందించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు గిరిబాల సింగ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేసిన కొన్ని గంటల్లోనే మే 28న సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది.80 కిలోల డమ్మీతో సీన్ రీక్రియేషన్గత నెల మే 12న ట్విషా శర్మ తన అత్తవారింట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ, విచారణ పరిధిని వేగవంతం చేసింది. ట్విషా శర్మ జీవితంలో చివరి గంటల్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సోమవారం నాడు దర్యాప్తు సంస్థ ఘటనా స్థలంలో క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేసింది. ఇందులో భాగంగా ట్విషా బరువుకు సమానమైన 80 కిలోల డమ్మీని ఉపయోగించారు. సీన్‌ను పునర్నిర్మించడానికి ముందు ఆ డమ్మీ బరువును తూకం యంత్రంపై కూడా సరిచూశారు.విచారణలో కీలక వ్యత్యాసాలుపోస్ట్మార్టం నివేదికలో పేర్కొన్న ట్విషా ఎత్తుకు, ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్లకు మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ సందిగ్ధతను తొలగించడానికి దర్యాప్తు సంస్థ వేర్వేరు ఎత్తులు ఉన్న మరో రెండు డమ్మీలను కూడా సిద్ధం చేసి పరిశీలించింది. కోడలి మరణానికి గల అసలు కారణాలను, పరిస్థితులను వెలికితీసేందుకు సీబీఐ అన్ని కోణాల్లోనూ ఆధారాలను సేకరిస్తోంది. -
కోడలు చనిపోతే.. ” మొక్కలకు నీళ్లు పోసేది కాదని అసలు వెటకారం ఏంటి
-
కడుపులో బిడ్డ తనది కాదని.. ట్విషాని మెంటల్ టార్చర్ చేసి చంపేసి..
-
త్విషా శర్మ మృతి కేసు రిటైర్డ్ జడ్జి గిరిబాల అరెస్ట్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నటి, మాజీ మోడల్ త్విషా శర్మ(33)కేసు మరో మలుపు తిరిగింది. ఆమె అత్త, రిటైర్డ్ జిల్లా జడ్జి అయిన గిరిబాలా సింగ్‌ను ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. అంతకుముందు, మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కేసులో దిగువ కోర్టు ఆమెకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. ముగ్గురు అధికారులతో కూడిన సీబీఐ బృందం దర్యాప్తులో భాగంగా ఉదయం 10.30 గంటల సమయంలో గిరిబాలా సింగ్‌ను ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ బృందం ఈ సందర్భంగా ఆమె ఇంటి డిజిటల్ మ్యాపింగ్ చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసు దర్యాప్తునకు భోపాల్‌లో ప్రత్యేక కార్యాలయానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్‌ను కోరినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం త్విషా శర్మ మృతి కేసులో వివిధ ఘటనల క్రమం, గిరిబాలా సింగ్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు బుధవారం మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. కట్నం వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న గిరిబాలా సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌లకు ఈ నెల 15వ తేదీన భోపాల్‌లోని సెషన్స్ కోర్టు బెయిలిచ్చింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సీబీఐ తరఫున కోర్టులో పిటిషన్ వేశారు. త్విషా అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్థ్ సింగ్‌లకు ముందస్తు బెయిల్ మంజూరు విషయంలో దిగువ కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం అర్థమవుతోందంటూ పేర్కొన్నారు. అత్తింటి వారు త్విషాను సంతోషంగా ఉండేందుకు, కనీసం బాధపడేందుకు సైతం అవకాశమివ్వలేదన్నారు. ముందస్తు బెయిల్ పొందిన గిరి బాలాసింగ్ 18వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి త్విషా శర్మపై అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ, ఆమె ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించారని తెలిపారు. గిరిబాలా సింగ్ తన పలుకుబడిని ఉపయోగించుకుని ఘటనా స్థలంలో ఆధారాలను తారుమారు చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో సాక్ష్యాధారాలను సరిగ్గా పరిశీలించాల్సిన బాధ్యత ట్రయల్ కోర్టుపై ఉన్నందున, ఆమెకు ముందస్తు బెయిల్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. -
ట్విషా శర్మ మృతి కేసు.. సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును శనివారం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే 25) ఈ కేసుపై విచారించే అవకాశం ఉంది. 33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన అత్తవారింట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలినప్పటికీ, ఆమె కుటుంబం ఈ నిర్ధారణలను తిరస్కరిస్తూ, ఇందులో కుట్ర ఉందని ఆరోపిస్తోంది. కాగా ఈ కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్.. శుక్రవారం జబల్పూర్ జిల్లా కోర్టులో లొంగిపోవడానికి వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి భోపాల్ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో అతడిని భోపాల్ కోర్టు శనివారం 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్ వృత్తిరీత్యా న్యాయవాది కాగా, ఆమె అత్తగారు గిరిబాల సింగ్ పదవీ విరమణ చేసిన రిటైర్డ్ న్యాయమూర్తి. -
ట్విషా శర్మ డెత్ మిస్టరీలో సంచలనాలు.!
-
నటి ట్విషా శర్మ కేసులో మరో ట్విస్ట్


