వీధికుక్కల కేసులో మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీపై సుప్రీంకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసింది. దేశ అత్యున్నత ధర్మాసనంపై ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదంది. ఇటీవల మేనకగాంధీ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సుప్రీంకోర్టును విమర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
వీధికుక్కల కేసును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. మేనకాగాంధీ తరపు న్యాయవాది రాజు రామచంద్రన్‌ని కోర్టు ప్రశ్నిస్తూ" కొద్దిరోజుల క్రితం మీరు కోర్టులు ఉదాసీనంగా వ్యవహరించాలన్నారు. మీ క్లైంట్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో మీరు గమనించారా? మీ క్లైంట్ తప్పు చేసింది. అయినా మేము ఏ తనపై ఎటువంచి చర్యలు తీసుకోలేదు. ఇది మా గొప్పతనం కాదా? ఆమె పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మాటలు మీరు చూశారా? ఆమె బాడీలాంగ్వేజ్ ఏంటి? అని ప్రశ్నించింది. " మీరేమో కోర్టులకు ఉదాసీనత ఉండాలంటారు మరోవైపు మీక్లైంట్ ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మీ క్లైంట్( మేనకాగాంధీ) ప్రస్తుతం జంతువుల హక్కుల కార్యకర్తగా ఉంది, ఆమె గతంలో కేంద్రమంత్రిగా పనిచేసింది. అయితే జంతువుల రక్షణకోసం ఇప్పటి వరకూ తను చేసిన పనులు ఏంటి? వాటి కోసం బడ్జెట్‌లో ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించిందా? లేదా వాటికోసం మూగజీవాల ఏదైనా కొత్త పథకాలు వచ్చేలా చేసిందా అని కోర్టు ప్రశ్నించింది.
కుక్కకాటు వేస్తే వాటికి ఆహారం వేసిన వారిని బాధ్యులు చేయాలని గతంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు సరదాకు చేసిన కావని సీరియస్‌గా మాట్లాడినవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా వీధికుక్కలను నియంత్రించలేకపోతే అవి కరిస్తే పెద్దమెుత్తంలో పరిహారం చెల్లించేలా ప్రభుత్వాల్ని ఆదేశిస్తామని ఇదివరకే కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే.


