ఢిల్లీ సాక్షి: దేశవ్యాప్తంగా వీదికుక్కల బెడద తీవ్రమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు వీధి కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే కఠిన చర్యలు విధిస్తామని ప్రకటించింది. శునకాలు కరవడం వల్ల పిల్లలు లేదా పెద్దలు ఎటువంటి ప్రమాదానికి గురైనా దాని సంబంధించి రాష్ట్రాలే పరిహారం చెల్లించేలా ఆదేశిస్తామని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరగడంతో ప్రజలలో రేబీస్‌తో పాటు ఇతర ప్రమాదకర వ్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, క్రీడా సముదాయాలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాగ్ షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది. అయితే తాజాగా ఈ కుక్కల బెడద కేసును సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్‌నాధ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు( మంగళవారం) మరోసారి విచారించింది.
ఈ నేపథ్యంలో జస్టిస్ విక్రమ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు "వీధి కుక్కల బెడద నివారణకు రాష్ట్రాలు సరైన చర్యలు తీసుకోకుంటే పెద్దలను, పిల్లలను కుక్కలు కరిస్తే అధిక మెుత్తంలో రాష్ట్రాలు పరిహారం చెల్లించేలా ఆదేశిస్తాం. అదేవిధంగా కుక్కలకు పుడ్ పెట్టేవారు వారి ఇంట్లోని వాటిని పెంచుకొని అక్కడే వాటికి తిండిపెట్టండి". అని జస్టిస్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. జంతు ప్రేమికులము అని చెప్పుకునే సంస్థలు తొమ్మిదేళ్ల బాలుడిపై శునకాలు దాడి చేసినప్పుడు ఏందుకు బాధ్యత తీసుకోలేదు అని జస్టిస్ ప్రశ్నించారు.
అదే విధంగా కుక్కలకు ఆహారం ఇచ్చేవారిపై వేదింపులకు గురవుతున్నాయి అని వచ్చిన పిటిషన్‌ను తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అది శాంతిభద్రతల సమస్యని అలా వేధింపులకు గురైన వారు వ్యక్తిగతంగా కేసు నమోదు చేసుకోవాలని సూచించింది. వీధుల్లోని అన్ని కుక్కలను తొలగించాలని తామెప్పుడూ ఆదేశించలేదని యనిమల్ బర్త్ రూల్ ప్రకారం చికిత్స కాని వాటిని షెల్టర్లకు తరలించాలని తెలిపినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.


