కానిస్టేబుల్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: దాదాపు 36 సంవత్సరాల క్రితం 500 రూపాయల లంచం తీసుకున్న నేరానికి గతంలో హైకోర్టు న్యాయస్థానం ఆనాటి కానిస్టేబుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సగానికి తగ్గించింది. దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు వేసిన శిక్షను 14 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చి న తీర్పును జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ పీబీ వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
అయితే 75 ఏళ్ల వయసులో మాజీ ఉత్తరాఖండ్ ఎక్సయిజ్ కానిస్టేబుల్ రెండేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించలేడని పేర్కొంటూ ఆ శిక్షను ఏడాదికి కుదించింది. అవినీతి నిరోధక చట్ట నిబంధనలను అనుసరిస్తూ మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


